భక్తులను ఆశీర్వదిస్తున్న శునకం.. ఆ ఆలయంలో ప్రత్యేకం

భక్తులను ఆశీర్వదిస్తున్న శునకం.. ఆ ఆలయంలో ప్రత్యేకం
అరుణ్ లిమాడియా ఈ వీడియోని రికార్డ్ చేసి దానిని ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.

భక్తులు ఆలయానికి వెళితే అక్కడ పూజారి నాలుగు అక్షింతలు చల్లి ఆశీర్వదించడం అందరికీ తెలుసు. కానీ విచిత్రంగా మహారాష్ట్రలోని ఓ ఆలయంలో శునకం ఆశీర్వదించడం ఆశ్చర్యంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. మహారాష్ట్రలోని ఒక ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఒక శునకం భక్తుల చేతులు పట్టుకుంటుంది. వంగి నమస్కరించిన వారికి తలమీద చేయి పెడుతూ ఆశీర్వదిస్తోంది.

ఈ సంఘటనను అహ్మద్‌నగర్ జిల్లాలోని సిద్ధాటెక్ ప్రాంతంలో ఉన్న సిద్ధివినాయక్ ఆలయంలో చోటు చేసుకుంది. అరుణ్ లిమాడియా ఈ వీడియోని రికార్డ్ చేసి దానిని ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఉన్న శునకం ఆలయం ముఖ ద్వారం వద్ద ఉన్న ఒక రాతి బండపై ప్రశాంతంగా కూర్చొని, ప్రజలను తన పంజాతో ఆశీర్వదిస్తోంది. ఆలయాన్ని సందర్శిస్తున్న భక్తులను ఆశీర్వదించడానికి శునకం ప్రతిరోజూ ఒకే చోట కూర్చుంటుంది.


Tags

Read MoreRead Less
Next Story