మూడో కోవిడ్ టీకా కూడా రెడీ!

మూడో కోవిడ్ టీకా కూడా రెడీ!
. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే రెండు కోవిడ్ -19 వ్యాక్సిన్ల కోసం అనుమతి ఇచ్చింది

కోవిడ్ -19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వి అత్యవసర వినియోగ అనుమతి కోసం డ్రగ్స్ రెగ్యులేటర్ డిసిజిఐని సంప్రదించింది డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్. అనుమతి కోసం కావాల్సిన డేటాను కూడా సిద్ధం చేసింది కంపెనీలు. ఫిబ్రవరి 21 నాటికి 2వ దశ ప్రయోగాలకు సంబంధించి ఫుల్ డేటాతో పాటు.. థర్డ్ ఫేజ్ తాత్కాలిక డేటాను కూడా అందజేయనుంది కంపెనీ.

గత ఏడాది సెప్టెంబర్‌లో స్పుత్నిక్ V క్లినికల్ ట్రయల్స్ నిర్వహణతో పాటు.. భారతదేశంలో పంపిణీ హక్కులను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ కంపెనీ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ RDIFతో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో ఇది 3వ దశ క్లినికల్ ట్రయల్‌లో ఉంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే రెండు కోవిడ్ -19 వ్యాక్సిన్ల కోసం అనుమతి ఇచ్చింది. భారత్ బయోటెక్ కోవాక్సిన్ మరియు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కు చెందిన కోవిషీల్డ్ అందుబాటులో ఉన్నాయి. పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీనిని తయారుచేస్తోంది.

ప్రస్తుతం కోటిమందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు అందిస్తున్నారు. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్ మధ్యంతర విశ్లేషణలో స్పుత్నిక్ వి 91.6 శాతం ఎఫికసీ ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ టీకా 60 ఏళ్లు పైబడిన వారిలో 2,144 వాలంటీర్లకు ఇచ్చారు. 91.8 శాతం సమర్థతను ప్రదర్శించింది.

Tags

Read MoreRead Less
Next Story