నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా..

నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా..
నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసారు.

నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డ్రెస్ కోడ్ విధించింది. సంప్రదాయ దుస్తులు అంటే బురఖా లాంటివి ధరించేవారు ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలి. వారిని నిబంధనల ప్రకారం తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. నార్మల్ వేర్ ధరించాలి. పెద్ద బటన్లు, ఫుల్ స్లీవ్స్ ఉన్న దుస్తులు వేసుకుని వస్తే అనుమతించరు. చెప్పులు, శాండిల్స్ మాత్రమే వేసుకోవాలి. అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు)ని కూడా తీసుకురావాల్సి ఉంటుంది.

పరీక్షా సెంటర్ కు చేరుకున్న విద్యార్థులకు ముందుగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఆ తరువాతే సిబ్బందిని అయినా, విద్యార్థులను అయినా లోపలికి అనుమతిస్తారు.

హాల్లో భౌతిక దూరం పాటించేలా ప్రతి విద్యార్థికీ మధ్య ఆరడుగల దూరం ఉంటుంది.

మాస్కులు, గ్లౌజులు తప్పని సరిగా ధరించాలి. తరచూ చేతుల్ని శానిటైజ్ చేసుకోవాలి.

ఆరోగ్య సమస్యలు తలెత్తిన వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి పంపి, ఇతర మార్గాల ద్వారా పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.

పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, బ్యాగులు, ఇతరత్రా వ్యక్తిగత వస్తువులకు అనుమతి లేదు.

పేపర్లను పంచేటప్పుడు లేదా లెక్కించేటప్పుడు సిబ్బందికాని, విద్యార్థులు కాని ఎట్టిపరిస్థితుల్లో లాలాజలాన్ని వాడకూడదు.

ఈ పరీక్ష ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, విజయవాడ, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 151 కేంద్రాల్లో జరుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story