dwarf couple marriage: మూడడుగుల జంట.. ఏడడుగులు నడిచి..

dwarf couple marriage: మూడడుగుల జంట.. ఏడడుగులు నడిచి..
dwarf couple marriage: విష్ణుచారి, జ్యోతి ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. ఓ ప్రైవేట్ వేడుకలో ఇద్దరూ కలుసుకున్నారు.

chikkaballapur: కర్ణాటక చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణి తాలూకాలోని కైవర శ్రీ క్షేత్రం యోగినారాయణుని తపోవనం. ఆదివారం ఇక్కడ సామూహిక వివాహాలు జరిగాయి. ఆలయ అధికారులు ఇక్కడ ఉచిత వివాహాలు జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే కైవార క్షేత్రంలో ఆదివారం జరిగిన పెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

బెంగళూరు టి దాసరహల్లికి చెందిన జ్యోతికి 3 అడుగుల 8 అంగుళాల పొడవు గల విష్ణుచారి అనే 28 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిగింది. జ్యోతి బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె 3 అడుగుల 5 అంగుళాల పొడవు ఉంటుంది. ఆలయానికి వచ్చిన వారు నూతన వధూవరులను ఆశీర్వదించి వందేళ్లు చల్లగా ఉండాలని వధూవరులను దీవించారు.

విష్ణుచారి, జ్యోతి ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. ఓ ప్రైవేట్ వేడుకలో ఇద్దరూ కలుసుకున్నారు. వారి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విష్ణుని తన కుటుంబసభ్యులకు పరిచయం చేస్తూ, జ్యోతి తన పెళ్లి గురించి చెప్పింది. దీంతో రెండు కుటుంబాలు కూర్చొని తమ పెళ్లి నిర్ణయం గురించి మాట్లాడుకున్నాయి.

కైవర ఆలయంలో ఇప్పటికీ ఉచిత వివాహాలు జరుగుతుంటాయి. జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉండవనే నమ్మకంతో జ్యోతి, విష్ణు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆలయంలో జరిగిన అరుదైన జంట వివాహాన్ని చూసిన భక్తులు మొదట బాల్య వివాహం జరుగుతుందని భావించారు. కానీ వారిద్దరూ మరుగుజ్జులని తెలిసి ఆశ్చర్యపోయారు. ఆ జంట వైవాహిక జీవితాన్ని చూసి పులకించిపోయారు. దంపతులద్దరూ చిలకా గోరింకల్లా తమ దాంపత్య జీవితాన్ని సాగించాలని అక్షితలు వేసి ఆశీర్వదించారు.

Tags

Read MoreRead Less
Next Story