అక్కడికి వెళ్తే కెవ్వు కేక.. పాములతో మసాజ్

అక్కడికి వెళ్తే కెవ్వు కేక.. పాములతో మసాజ్
ఓ స్పాలో ఇదే స్పెషల్. ఇక్కడ మనుషులకు బదులు పాములు మసాజ్ చేస్తాయి. చిన్న పాముల నుంచి కొండ చిలువ వరకు ప్రతి పామును

పాము పేరు వింటేనే ఒళ్లంతా జలదరించినట్లు ఉంటుంది.. ఇక ఒంటి మీద పాకితే వామ్మో.. పై ప్రాణాలు పైనే పోవడం ఖాయం.. కానీ ఇక్కడ పాములతో మసాజ్ చేయించుకుంటే ప్రాణం లేచొస్తుందట.. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు అన్నీ పోయి హాయిగా ఉంటుందట. కైరోలోని ఓ స్పాలో ఇదే స్పెషల్. ఇక్కడ మనుషులకు బదులు పాములు మసాజ్ చేస్తాయి.

చిన్న పాముల నుంచి కొండ చిలువ వరకు ప్రతి పామును కస్టమర్ మీదకు వదులుతారు. సుమారు 28 రకాల పాములతో ఇక్కడ స్నేక్ మసాజ్‌ సెంటర్ నడుస్తోంది. అన్నీ విషం లేని పాములే అయినా సెంటర్ పెట్టిన కొత్తల్లో మసాజ్ చేయించుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.. మొదట్లో ఉచితంగానే స్నేక్ మసాజ్ చేసేవారు. రాను రాను కస్టమర్లకు స్నేక్ మసాజ్ పట్ల అవగాహన రావడంతో ఇప్పుడు 30 నిమిషాలు మసాజ్ చేయించుకుంటే 20 నుంచి 30 ఈజిప్షియన్ పౌండ్లు వసూలు చేస్తున్నారు. (మన కరెన్సీలో రూ.466). 30 నిమిషాల పాటు బెడ్ మీద పడుకుంటే పాములన్నీ శరీరంపై పాకుతూ ఉంటాయి.

స్పా యజమాని సఫ్వాత్ సెడ్కీ మాట్లాడుతూ.. పాములతో మసాజ్ చాలా ప్రత్యేకమైనది. దీని వల్ల కండరాలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రక్తప్రసరణ మెరుగవుతుంది. శారీరకంగానే కాకుండా మానసికంగాను మంచి ఫలితాన్నిస్తుంది స్నేక్ మసాజ్. పాములు శరీరంపై పాకుతున్నప్పుడు వారిలో కొన్ని భావోద్వేగాలు కలుగుతాయి.

దాని వల్ల ఎండార్ఫిన్ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. దీనివల్ల వారిలోని రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది అని తెలిపారు. కస్టమర్ల కోరిక మేరకు వివిధ రకాల పాములతో మసాజ్ చేస్తారు. శరీరం మీద ముఖం మీద వాటిని వదులుతారు. మరి పాములతో మసాజ్ చేయించుకుందాం.. ఒకసారి ట్రై చేద్ధాం అని మీకూ ఉంటే ఈజిప్ట్‌లోని కైరో వెళ్లాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story