మాతృభాషలో విద్యాబోధనపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

మాతృభాషలో విద్యాబోధనపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు మాతృభాషనే మీడియంగా ఎంచుకున్నాయని ధర్మాసనం గుర్తు చేసింది.

మాతృభాషలో విద్యాబోధనపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక విద్య పునాదులు సరిగ్గా ఉంటే ఇంగ్లిష్‌ లాంటి కొత్త భాష నేర్చుకోవడానికి ఇబ్బంది ఉండదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు మాతృభాషనే మీడియంగా ఎంచుకున్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్ల కేసు విచారణలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే 96 శాతం తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ మీడియం కోరుకుంటున్నారని సర్వేలో తేలిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. అలాగే తమ పిటిషన్‌లోని ముఖ్య విజ్ఞప్తులను వివరిస్తామని కూడా వెల్లడించారు. కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story