ర్యాలీలో అప‌శృతి.. ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి రైతు మృతి

ర్యాలీలో అప‌శృతి.. ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి రైతు మృతి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రైతులు చేప్టటిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతులు చేస్తున్న ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రైతులు చేప్టటిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతులు చేస్తున్న ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంద‌ర్భంగా పోలీసులకు, ఆందోళ‌న‌కారులకు మ‌ధ్య దాడులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ప‌లువురు రైతులు, పోలీసులు గాయ‌ప‌డ్డారు. ఈ నేపధ్యంలో స్పీడ్‌గా వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతిచెందాడు. మృతి చెందిన రైతు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన న‌వ‌నీత్ సింగ్‌ (30)గా పోలీసులు గుర్తించారు. కాగా ఢిల్లీలో రైతుల ఆందోళనతో ఢిల్లీ హింసాత్మకంగా మారడంతో కేంద్ర హోంశాఖ అత్యవసరంగా భేటీ అయింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో సత్వర చర్యలపై చర్చిస్తున్నారు. ఆందోళన జరగుతున్న ప్రాంతాల్లో ఇప్పటికే ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. 25కు పైగా మెట్రో స్టేషన్లను బంద్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story