రైతుల ధర్నా.. ప్రధాని సహా ఎవరు హామీ ఇచ్చినా వెనక్కు తగ్గని కర్షకులు

రైతుల ధర్నా.. ప్రధాని సహా ఎవరు హామీ ఇచ్చినా వెనక్కు తగ్గని కర్షకులు

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. రహదారుల నిర్బంధానికి పిలుపునిచ్చిన రైతు సంఘాలు నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించాయి. అటు.. జైపూర్‌-ఢిల్లీ రహదారిని ట్రాక్టర్లతో నిర్బంధించడానికి సిద్ధమయ్యారు. మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఈనెల 19వ తేదీలోపు తమ డిమాండ్లు ఒప్పుకోవాలని అన్నారు. సోమవారం నిరాహార దీక్షకు దిగుతామని స్పష్టం చేశారు. రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా నుంచి రైతులు ఇంకా తరలివస్తున్నారు. గత 18 రోజులుగా రైతుల పోరాటం కొనసాగుతుంది. ఈ రైతులకు మద్దతుగా యూపీ బోర్డర్ లో ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.

రైతు నిరసనలు ఉధృతం అవుతుండటంతో ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించారు. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ చట్టాలను సమర్ధించే వారు కూడా తమ వాదనకు పదును పెడుతున్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. వీటిని రద్దు చేస్తే సహించబోమని.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు.


Tags

Read MoreRead Less
Next Story