వ్యవసాయ చట్టాలపై పట్టు వీడని అన్నదాతలు.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్

వ్యవసాయ చట్టాలపై పట్టు వీడని అన్నదాతలు.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్
వ్యవసాయ చట్టాలపై అన్నదాతలు పట్టు వీడడం లేదు. చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని సైతం వారు లెక్కచేయడం లేదు.

వ్యవసాయ చట్టాలపై అన్నదాతలు పట్టు వీడడం లేదు. చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని సైతం వారు లెక్కచేయడం లేదు. ఢిల్లీలో నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తున్నా రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పట్టు సడలకుండా నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జాం తప్పడం లేదు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను రూట్ మళ్ళిస్తున్నారు

సోమవారం కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు కూడా కొలిక్కి రాలేదు. ఏడో విడద చర్చల్లోనూ ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబట్టారు. కానీ సవరణలకు మాత్రం ఓకే అంటున్న ప్రభుత్వం... చట్టాలు రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

కావాలనుకుంటే సుప్రీం కోర్టుకు వెళ్లొచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారని రైతులు వాపోతున్నారు. కానీ తమ డిమాండ్లు నెరవేరే దాకా ఢిల్లీ వీడే ప్రసక్తే లేదని రైతులు తెగేసి చెప్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున భారీ ర్యాలీ చేపడతామంటున్నారు. మరోవైపు ఎనిమిదో విడత చర్చలను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8న రైతులతో జరుపనుంది.

Tags

Read MoreRead Less
Next Story