Elections Results 2021: నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..

Elections Results 2021: నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..
ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ తృణముల్‌కు.. బీజేపీ చెక్ పెడుతుందా..? లేక మళ్లీ టీఎంసీనే పాగా వేస్తుందా..?

దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. మరికాసేపట్లో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లల్లో ఏయే పార్టీలు అధికారంలోకి రానున్నాయి..? ఎవరు పైచేయి సాధిస్తారు..? అక్కడున్న అధికార పక్షానికి ధీటుగా నిలిచేదెవరు.. గెలిచేదెవరు..? అనేది దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చ నడుస్తోంది.

ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ తృణముల్‌కు.. బీజేపీ చెక్ పెడుతుందా..? లేక మళ్లీ టీఎంసీనే పాగా వేస్తుందా..? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా పూర్తి స్థాయి నిబంధనలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.

దీనికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గత నెల 29నే వెలువడ్డాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కన్నా.. ఇవాళ అసలు ఫలితాలే విడుదల కానుండటంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంలల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10 గంటల నుంచి లెక్కింపు ధోరణిని అర్ధం చేసుకోవచ్చు.

మధ్యాహ్నం నాటికి ఎవరు గెలుస్తారనేది తెలిసినప్పటికీ.. సాయంత్రం పూర్తిగా స్పష్టత రానుంది. కరోనా కారణంగా కొంత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా పూర్తి స్థాయి నిబంధనలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే ఏజెంట్లకు అనుమతి ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవిడ్ దృష్ట్యా ఓట్ల లెక్కింపు అనంతరం ర్యాలీలు కూడా నిషేధించారు.

Tags

Read MoreRead Less
Next Story