ఒడిశాలో భారీ వర్షాలు.. 12కి చేరిన మృతులు

ఒడిశాలో భారీ వర్షాలు.. 12కి చేరిన మృతులు
ఒడిశాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి.

ఒడిశాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణం వేర్వేరు ప్రమాదాల్లో మరో ఐదుగురు మరణించారు. ఇంతకు ముందు మృతి చెందిన ఏడుగురుతో మొత్తం మృతుల సంఖ్య 12కి చేరింది. అటు, బర్గఢ్‌, మయూర్‌భంజ్‌లో ఇద్దరు గల్లంతయ్యారని స్పెషల్‌ రిలీఫ్‌ కమిషనర్‌ పేర్కొన్నారు. వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు 39 బృందాలను ఒడిశా ప్రభుత్వం రంగంలోని దించింది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ ఎఫ్), ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఓడీఆర్ఏఎఫ్) సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఒడిశాలోని మారుమూల ప్రాంతాలు గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ వరదనీటిలో మునిగిపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story