ఎంత మంచి ప్రిన్సిపల్.. స్కూల్లో చదివే చిన్నారుల కోసం..

ఎంత మంచి ప్రిన్సిపల్.. స్కూల్లో చదివే చిన్నారుల కోసం..
పైగా ప్రీ పైమరీ స్కూల్ పిల్లలకు అసలు అర్థం కాదు. అందుకే ఆ స్కూల్ ప్రిన్సిపల్ తన స్కూల్లో చదివే చిన్నారులందరికీ

కరోనా ఆనందాలన్నీ హరించి వేస్తోంది. పండక్కి బట్టలు కొందామంటే డబ్బులు లేవు. ఇక పక్క వాళ్లకి గిప్ట్‌లు ఏం ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా వాసులు ఇంకా బాధపడుతున్నారు. అక్కడ క్రిస్మస్ వేడుకలు ప్రతి ఏడాది అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. కానీ ఈ ఏడాది ఆ ఉత్సాహాన్ని నీరు గార్చింది కరోనా.

చిన్నపిల్లలకు ఆ విషయాలేవీ తెలియవు. పైగా ప్రీ పైమరీ స్కూల్ పిల్లలకు అసలు అర్థం కాదు. అందుకే ఆ స్కూల్ ప్రిన్సిపల్ తన స్కూల్లో చదివే చిన్నారులందరికీ శాంతక్లాజ్‌లా బహుమతులు ఇవ్వాలనుకుంది. అంత డబ్బు తన దగ్గర లేకపోయినా ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలనుకుంది.

ఆ వచ్చిన డబ్బుతో పిల్లలకు చిన్న చిన్న బహుమతులైనా సరే ఇచ్చి వాళ్లని సంతోష పరచాలనుకుంది. అమెరికాలోని ఇండియానా పోలిస్ ప్రాంతంలో నివసించే దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. కరోనా ప్రభావం కూడా అక్కడ ఎక్కువగా ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు గిప్ట్‌లు కొనడం కష్టంగా మారింది తల్లిదండ్రులకు. విషయం గ్రహించిన ప్రీ స్కూల్ ప్రిన్సిపల్ తన విద్యార్థులక తానే బహుమతులు ఇవ్వాలనుకుంది. స్కూల్లో చదువుకునే విద్యార్ధులతో పాటు, వారి సోదరులకు కూడా తనే బహుమతులు ఇవ్వాలని భావించింది. దీని కోసం స్కూలు అయిపోయిన తర్వాత రెండో ఉద్యోగం చేయడానికి సిద్ధపడింది.

ఈ క్రమంలో ఉబెర్ డ్రైవర్ అవతారం ఎత్తిన రేనీ డిక్సన్ అయే మహిళ.. అర్థరాత్రి ఒకటి, రెండు గంటల వరకు రైడ్లు వేస్తోంది. ఇటీవల ఉబెర్‌కు డిమాండ్ తగ్గినట్లు గమనించి మరో రైడింగ్ కంపెనీలో కూడా జాయిన్ అయ్యింది. ఇలా రెండు ఉద్యోగాలు చేసి 2,500 డాలర్లు అంటే దగ్గరదగ్గరగా రెండు లక్షల రూపాయలు పోగు చేసింది. ఆ సొమ్ముతో తన విద్యార్థులందరికీ రెండు బహుమతులు కొనవచ్చు. ఒకటి స్కూలు తరపున ఇస్తూ.. మరొకటి వారి తల్లిదండ్రుల పేరిట లేదా శాంతా పేరిట అందజేస్తానని రెనీ చెప్తోంది.

అలాగే తన స్కూల్లో పనిచేసే టీచర్లందరికీ ఓ 50 డాలర్ల బోనస్ కూడా ఇవ్వాలని ఆమె భావిస్తోంది. ఇది కేవలం క్రిస్మస్ కోసం మాత్రమే కాదని, ఆ తర్వాత కూడా పిల్లలందరికీ చలికోట్లు, బూట్లు అవసరం అవుతాయని, అప్పుడు కూడా తాను ఇలానే చేస్తానని రేనీ స్పష్టం చేసింది. కరోనా కష్టాలు ప్రజల జీవితాల్లో కల్లోలం సృష్టించాయి. దీనిలో పిల్లల తప్పేమీ లేదు. వారు సంతోషంగా పండుగ జరుపుకునేలా చూడడం నా బాధ్యత అని రేనీ చెప్తోంది.

Tags

Read MoreRead Less
Next Story