BS Yediyurappa : నటుడిగా మారిన మాజీ సీఎం... అందులోనూ ముఖ్యమంత్రే

BS Yediyurappa : నటుడిగా మారిన మాజీ సీఎం... అందులోనూ ముఖ్యమంత్రే
BS Yediyurappa : 'తనూజ' అనే చిత్రంతో నటుడిగా శాండల్‌వుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు బీజేపీ నేత, కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప.

BS Yediyurappa : 'తనూజ' అనే చిత్రంతో నటుడిగా శాండల్‌వుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు బీజేపీ నేత, కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప. ఈ చిత్రంలో ఆయన ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నారు. ఆయనకి సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిందని దర్శకుడు హరీష్ ఎండి హల్లి వెల్లడించారు.


ఈ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి నటించడం వెనుక ప్రధానమైన కారణం లేకపోలేదు. గతంలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనూజ అనే అమ్మాయి కోవిడ్ కారణంగా నీట్ పరీక్ష రాయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఆ తర్వాత ఓ ఇద్దరు జర్నలిస్టుల సాయంతో ఆమె పరీక్ష రాసింది.


నీట్‌ పరీక్షలో ఆమె ఉత్తీర్ణత సాధించడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. తనూజ పరీక్ష రాసేందుకు 350 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ సినిమాలో యడ్యూరప్ప నటించడంతో సినిమా పైన మరింత ఆసక్తి పెరిగింది. బియాండ్ విజన్ సినిమాస్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.


శివమొగ్గ, బెంగళూరులోని పలు ప్రాంతాల్లో షూటింగ్‌ జరిగింది. యడ్యూరప్ప షూట్‌లో పాల్గొంటున్న కొన్ని ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయన అభిమానులు షేర్ చేసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story