'అమ్మ' నవుతా.. అవకాశమిస్తారా..!!

అమ్మ నవుతా.. అవకాశమిస్తారా..!!
బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నప్పుడే రితేష్‌తో ప్రేమలో పడింది. అతడినే పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లి కూడా అయింది

నటీమణుల రీ ఎంట్రీ అమ్మ, అక్క, వదిన పాత్రలతో మొదలవుతుంది. బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా కూడా మళ్లీ సినిమాలపైకి మనసు పోతోంది. సరికొత్తగా ముస్తాబై మరోసారి ప్రేక్షకులను మెప్పించాలనుకుంటోంది. హాసిని పాత్రలో ఆమెని మాత్రమే ఊహించుకున్న ప్రేక్షకులు ఈ తరం నాయికలకు జెనీలియా అమ్మైతే అంగీకరిస్తారో లేదో.. పెళ్లి, పిల్లాడితో కొంత కాలం ఇండస్ట్రీకి దూరమైనా ఫిజిక్‌ని మెయింటైన్ చేస్తోన్న జెనీలియా మంచి కథ వస్తే నటించడానికి సిద్ధమంటూ ఇండస్ట్రీకి సిగ్నల్ పంపింది.

ఇప్పటికే కొన్ని కథలను వింటున్న ఆమె.. భర్త రితేష్‌తో కలిసి ఓ చిత్రంలో నటించనుందని సమాచారం. ముఖ్యంగా బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న జెనీలియా.. కథ నచ్చితే అమ్మ పాత్రకైనా ఓకే అంటోంది. ఇంతకుముందు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నప్పుడే రితేష్‌తో ప్రేమలో పడింది. అతడినే పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. మరి అల్లరి అమ్మాయిగా ప్రేక్షకుల మదిలో ముద్ర వేసుకున్న జెనీలియాను అమ్మగా అంగీకరిస్తారో లేదో చూడాలి. అయినా ఇప్పుడు అమ్మ పాత్రలంటే మోడర్న్ మదర్.. బిడ్డలతో పోటీ పడుతూ వగలు, వయ్యారాలు పోతోంది. అలాంటి స్క్రిప్ట్‌లతోనే దర్శకులు ఆనాటి నటీమణులను సంప్రదిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story