కరోనా బారిన పడ్డ మరో ముఖ్యమంత్రి

కరోనా బారిన పడ్డ మరో ముఖ్యమంత్రి
ఈ మధ్య కాలంలో మంత్రులు, ముఖ్యమంత్రులు కోవిడ్ బారిన పడుతున్న కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తానూ కోవిడ్ బారిన పడినట్లు బుధవారం ఉదయం ట్విట్టర్ లో పేర్కొన్నారు. 47ఏళ్ల వయసున్న సావంత్ కి కరోనా లక్షణాలు లేవని అయినా హోం క్వారంటైన్ లో ఉంటానని తెలిపారు. గత వారం రోజుల్లో తనని కలిసిన వారందరినీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మంగళవారం ఆయన గోవాలోని కోవిడ్ సంరక్షణ కేంద్రాల ఇన్‌ఛార్జి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి కేంద్రాల పనితీరును సమీక్షించారు. పాజిటివ్ పరీక్ష రావడానికి ఒక రోజు ముందు ముఖ్యమంత్రి గోవాలో కరోనా వైరస్ నిర్వహణను సమీక్షించేందుకు ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే, రెవెన్యూ మంత్రితో పాటు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. గత మార్చిలో మనోహర్ పారికర్ మరణానంతరం ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప, మధ్యప్రదేశ్ కు చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానాకు చెందిన ఎంఎల్ ఖత్తర్ తర్వాత వైరస్ బారిన పడిన నాల్గవ ముఖ్యమంత్రి సావంత్. గోవాలో ఇప్పటివరకు 18,006 కోవిడ్ కేసులు నమోదయ్యాయి

Tags

Read MoreRead Less
Next Story