మ‌ళ్లీ త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

మ‌ళ్లీ త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

అమెరికాలో ఉద్దీప‌న ప్యాకేజీ వార్త‌లు, బ‌ల‌ప‌డుతున్న డాల‌ర్ కార‌ణంగా బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. డిసెంబ‌ర్ గోల్డ్ ఫ్యూచ‌ర్ 0.3శాతం ప‌డిపోయింది. ప్ర‌స్తుతం రూ.50,679 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వ‌ర్ కూడా 1.12శాతం మాత్రం పెరిగింది. 1.2శాతం పెరిగి 61,749 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. ఇటీవ‌ల గోల్డ్ మార్కెట్లో తీవ్ర ఒత్తిడికి గురౌతుంది. ఆగ‌స్టులో బంగారం ధ‌ర ఏకంగా 10గ్రాములు 56200కు చేరింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ స్వ‌ల్పంగా త‌గ్గుతూ వ‌చ్చింది. ఔన్స్ స్పాట్ గోల్డ్ ధ‌ర‌లు 0.1శాతం త‌గ్గి 1899 డాల‌ర్లుకు చేరింది. సిల్వ‌ర్ 0.5శాతం ప‌డిపోయి 24.45డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ప్లాటిన‌మ్ కూడా 0.7శాతం త‌గ్గి 895 డాల‌ర్ల వ‌ద్ద ప‌లుకుతుంది.

Tags

Read MoreRead Less
Next Story