వారానికి నాలుగురోజులు మాత్రమే పనిదినాలుగా ప్రకటించిన గూగుల్

వారానికి నాలుగురోజులు మాత్రమే పనిదినాలుగా ప్రకటించిన గూగుల్

కరోనా మహమ్మారి ప్రభావం ప్రభావం ఉద్యోగులపై పడింది. చాలామంది ఉద్యోగాలు ఇప్పటికే ఊడిపోయాయి. మరికొంత మంది ఎప్పుడు ఊడిపోతాయో తెలియని ఆందోళనలో ఉన్నారు. ఉద్యోగాలు చేస్తున్నా.. జీతాలు పడతాయో.. జీతంలో కోతలు పడతాయో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ రేటు రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో ఎక్కువ ఉద్యోగాలు ఊడిపోయాయి. ఉన్న కొద్ది మందితో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ తమ ఉద్యోగుల ఇబ్బందులను గమనించి.. బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిదినాలను ప్రకటిస్తూ.. మూడు రోజులు వీక్లీ ఆఫ్ గా ప్రకటించింది. ఇప్పటికే శనివారం, ఆదివారం వీక్లీ ఆఫ్ల్ గా ఐటీ ఉద్యోగులకు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గూగుల్ సంస్థ శుక్రవారాన్ని ప్రత్యేక వీక్లీ ఆఫ్ గా ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story