గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించడంపై స్పందించిన పేటీఎం

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించడంపై స్పందించిన పేటీఎం
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించడంపై పేటీఎం స్పందించింది.

ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్ పేటీఎంను గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి తొలగిచింది. పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్‌ గేమ్స్‌ను కూడా తీసివేసింది. అయితే గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించడంపై పేటీఎం స్పందించింది. గూగుల్‌ ప్లేలో ప్రస్తుతానికి పేటీఎం ఆండ్రాయిడ్‌ యాప్‌ కొత్తగా డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, అప్‌డేట్‌ చేసుకోవడానికి అందుబాటులో లేదని పేర్కొంది. త్వరలో మళ్లీ సేవలు ప్రారంభమవుతాయని తెలిపింది. ప్రస్తుతానికి పేటీఎం యాప్‌ను యథావిధిగా వినియోగించుకోవచ్చని, అందులో సొమ్ముకు ఎలాంటి ఢోకా లేదని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం పేటీఎంకు 5 కోట్ల మంది నెలవారీ యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story