Google: ఉద్యోగులపై 'గూగుల్' సీరియస్.. జనవరి 18 లోపు..

Google: ఉద్యోగులపై గూగుల్ సీరియస్.. జనవరి 18 లోపు..
Google: తాజాగా గూగుల్ లీడర్‌షిప్ పేరిట ఒక మెమో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Google: కరోనా తగ్గింది.. ఇంటినుంచి ఇక వర్క్ చేయడం ఆపండి.. ఆఫీసుకి రండి అని చెప్పిన కొద్ది రోజుల్లోనే ఒమిక్రాన్ అంట వద్దులే బాబు.. ఇంట్లో ఉండే పని చేయమంటూ కొన్ని టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేశాయి.

అయితే గూగుల్ మాత్రం తమ ఉద్యోగులను ఆఫీస్‌కి వచ్చి పనిచేయమంటూ ఆర్డర్స్ పాస్ చేసింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులను తొలగించాలని గూగుల్ యోచిస్తున్న క్రమంలో సంస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా గూగుల్ లీడర్‌షిప్ పేరిట ఒక మెమో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. డిసెంబర్ 3 లోపు వ్యాక్సినేషన్ స్టేటస్‌ను సమర్పించని ఉద్యోగులపై చర్యలు తప్పవని అందులో పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడమో లేదా శాశ్వతంగా విధుల నుంచి తొలగించడమో చేయాలని భావిస్తోంది.

ఈ అఫీషియల్ మెమో ప్రకారం వ్యాక్సినేషన్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై జనవరి 18, 2022 లోపు చర్యలు ఉంటాయి. వాళ్లను ముందుగా 30 పెయిడ్ లీవ్ కింద పక్కన పెడతారు లేదా అన్‌పెయిడ్ పర్సనల్ లీవ్ కింద ఆరు నెలలు పక్కనపెడతారు. అటుపిమ్మట ఏకంగా విధుల నుంచి తొలగిస్తారు.

అయితే ఈ మెమోపై స్పందించేందుకు గూగుల్ నిరాకరించింది. సంస్థ తీరును ఉద్యోగులు తప్పుపట్టడంతో ఆఘమేఘాల మీద ఉత్తర్వుల్ని నిలుపుదల చేసినట్లు ప్రకటించింది. కానీ అంతలోనే ఇలా ఉన్నపళంగా ఉద్యోగులను తొలగిస్తామన్న ప్రకటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story