అత్యధిక ఆదాయం కలిగిన సోమనాథ్ దేవాలయం..

అత్యధిక ఆదాయం కలిగిన సోమనాథ్ దేవాలయం..
ఈ గుడిని ఏడాదికి సుమారు 10 లక్షల నుండి 20 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు.

సోమనాథ్ ఆలయం భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం పశ్చిమ తీరంలో ఉంది. 12 జ్యోతిర్ లింగాలలో మొదటి లింగాన్ని ఇక్కడ స్థాపించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయాన్ని మహ్మద్ ఘజినీ 17 సార్లు దోచుకున్నాడు. అలాగే 8 సార్లు కూల్చాడు. అయినా అనేక సార్లు మళ్లీ ఈ ఆలయం తిరిగి నిర్మించబడింది. చివరిసారిగా 1951లో అప్పటి డిప్యూటీ ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఈ దేవాలయం తిరిగి నిర్మించారు. ఈ గుడిని ఏడాదికి సుమారు 10 లక్షల నుండి 20 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ దేవాలయం సంవత్సర ఆదాయం దాదాపు 5 నుంచి 10 కోట్ల దాకా ఉంటుందని అంచనా.

మహ్మద్ ఘజినీ దాడి చేసి సోమనాథ్ ఆలయంలో ఉన్న అపార సంపదను దోచుకుని పవిత్ర జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడని పురాణ కథలు చెబుతున్నాయి. దాదాపు 20 మిలియన్ దినార్ల సంపదను ఘజినీ తీసుకెళ్లారు. ఆలయాన్ని రక్షించేందుకు ప్రయత్నించిన 50,000 మంది భక్తులను మహమూద్ చంపాడని వాదనలు వినిపిస్తుంటాయి. ఘజ్ని దాడి సమయంలో ఉన్న ఆలయం ఒక చెక్క నిర్మాణంగా కనిపిస్తుంది. ధ్వంసం చేసిన ప్రతి సారి కొంతమంది హిందూ రాజులు ఈ ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించేవారు. ఇది ఎర్ర ఇసుకరాయితో కట్టబడిన భారీ నిర్మాణం. అద్భుతమై సోమనాథ్ ఆలయం ద్వారకకు సమీపంలో ఉంది. ద్వారక నుంచి సోమనాథ్‌కు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తే 231 కి.మీ ఉంటుంది. ప్రస్తుత సోమనాథ్ ఆలయాన్ని 1947 నుండి 1951 మధ్య కాలంలో ఐదేళ్లలో నిర్మించారు. దీనిని అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఇది భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన తీర్థయాత్రలలో ఒకటిగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సోమనాథ్ ఆలయ గోడలపై బ్రహ్మ, శివుడు, విష్ణువుల శిల్పాలను చూడవచ్చు. స్కంద పురాణంలోని మరొక సూచన ప్రకారం, సుమారు 6 బ్రహ్మలు ఉన్నాయి. షతానంద్ అని పిలువబడే 7 వ బ్రహ్మ యుగం ఇది. సోమనాథ్ ఆలయ శిఖరంపై ఉన్న జెండా 37 అడుగుల పొడవు ఉంటుంది. దీన్ని రోజుకు 3 సార్లు మారుస్తారు.

Tags

Read MoreRead Less
Next Story