బిర్యానీ ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలు

బిర్యానీ ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలు
బిర్యానీ , పులావ్ మరియు చాలా భారతీయ వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే బే ఆకు వంటకానికి రుచిని జోడించడానికి సహాయపడుతుంది.

భారతీయ వంటగదిలో బీర్యానీ ఆకుకి సముచిత స్థానం లభిస్తుంది. అనేక వన మూలికలు, సుగంధ ద్రవ్యాలతో భారతీయులు వంటలు తయారు చేస్తారు. ఇవి మన ఆహారానికి రుచులను జోడించడమే కాక ఆరోగ్యానికి ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంటాయి. లవంగాలు దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పసుపు అనేక ముఖ్యమైన పోషకాల యొక్క స్టోర్-హౌస్. అలాంటి మరొక మసాలా బే ఆకు (దీనిని హిందీలో తేజ్ పత్తా అని పిలుస్తారు). బిర్యానీ , పులావ్ మరియు చాలా భారతీయ వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే బే ఆకు వంటకానికి రుచిని జోడించడానికి సహాయపడుతుంది. ఇది శతాబ్దాలుగా సాంప్రదాయ ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.

బే ఆకు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:

తేజ్ పత్తాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, బి 6, ఐరన్, పొటాషియం వంటి గొప్ప వనరులెన్నింటినో కలిగి ఉంది. జీర్ణశయ వ్యవస్థపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ మసాలా దినుసులలో లభించే సమ్మేళనాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బే ఆకు ఒత్తిడి హార్మోన్లను నియంత్రించి, ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది. శరీరాన్ని మంట నుండి రక్షిస్తాయి.

జీర్ణక్రియను వేగవంతం చేయడానికి దాల్చిన చెక్కతో కలిపి టీ తయారు చేసుకుని తాగాలి. ఇది బరువు తగ్గడానికి మరింత సహాయపడుతుంది. బెంగళూరుకు చెందిన పోషకాహార నిపుణుడు డాక్టర్ అంజు సూద్ ప్రకారం, ఆల్ ఇన్ వన్ మసాలా "ఇన్సులిన్ స్థాయిని మెరుగుపరుస్తూ జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడుతుంది." దాల్చిన చెక్క కడుపులోని కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story