Chennai: చెన్నైను ముంచెత్తుతున్న వర్షాలు..

Chennai: చెన్నైను ముంచెత్తుతున్న వర్షాలు..
Chennai: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది

Chennai: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడంతో శుక్రవారం తమిళనాడులో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గురువారం సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల మధ్య అల్పపీడనం తమిళనాడు తీరం దాటడంతో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచాయి. భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన రెడ్ అలర్ట్ ఇప్పుడు ఉపసంహరించబడింది.

నీలగిరి, కోయంబత్తూరు, కన్యాకుమారి జిల్లాలతో సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మిగిలిన తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకల్ ప్రాంతంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం కూడా సెలవు.

వర్షాల కారణంగా 65,000 కంటే ఎక్కువ ఇళ్లకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రైళ్లు ఆలస్యంగా తిరుగుతున్నాయి. గురువారం సుమారు ఆరు గంటల పాటు విమాన రాకపోకలను నిలిపివేశారు. కాగా, గత 11 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు 14 మంది చనిపోయారు.

గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో కనీసం 1.45 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలు, 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు నీట మునిగాయి. తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి MRK పన్నీర్‌సెల్వం దీనిని "ప్రాథమిక అంచనా"గా పేర్కొన్నారు, దాదాపు 44 లక్షల ఎకరాల్లో సాగుచేసిన సాంబా వరి పంటకు నీరు తగ్గిన తర్వాతే అసలు నష్టాన్ని అంచనా వేయడానికి వీలవుతుందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story