మంటపుట్టిస్తున్న సూర్యుడి ప్రతాపం.. పదేళ్లలో లేనంతగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు

మంటపుట్టిస్తున్న సూర్యుడి ప్రతాపం.. పదేళ్లలో లేనంతగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు
గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడిచింది.

భానుడి భగ భగలు అప్పుడే మొదలయ్యాయి.. గతంలో కంటే ఒకటి రెండు కంటే ఎక్కువ డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడిచింది. గత మూడు రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఉదయం 7 గంటలకే సూర్యుడి భగ భగలు మొదలవుతున్నాయి. పగలు ఎండతీవ్రత... రాత్రి వేడిగాలులతో జనం అల్లాడుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది. గత పదిరోజులక్రితం విద్యుత్ డిమాండ్ 10వేల మెగావాట్లు ఉండగా... ప్రస్తుతం 13వేల 2వందలకు చేరినట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణాలోని పలు చోట్ల రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచిలో రికార్డుస్థాయిలో 39.7 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. ఫిబ్రవరి మాసంలో ఇదే అధిక ఉష్ణోగ్రత. అయితే 2017 సంవత్సరంలో ఇక్కడ కేవలం 37 డిగ్రీలుగానే ఉంది. ఇక నల్గొండ జిల్లా మునుగోడులో 39.6 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో జనం అ్లలాడుతున్నారు. భద్రాచలం, మంచిర్యాల, జగిత్యాల, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట,రంగారెడ్డి జల్లాలో పలు చోట్లు ఎండలు 39 డిగ్రీల పైనే నమోదయ్యాయి. అయితే ఈసారి రాష్ట్రంలో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అయితే ఈ యేడు సాధారణం కంటే ఒక డిగ్రీ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణాలో కోర్ హీట్ వేవ్ జోన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. దీనివల్ల వేసవిలో సూర్యకిరణాల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం యంత్రంగం ముందస్తు ఏర్పాట్లు చేయాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ ఏడు ఉత్తర తెలంగాణాలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించారు. మార్చి రెండో వారంలో సూర్యతాపం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.



Tags

Read MoreRead Less
Next Story