Karnataka High Court : విద్యాసంస్థల్లో హిజాబ్‌ తప్పని సరికాదు : కర్నాటక హైకోర్ట్‌ తీర్పు

Karnataka High Court : విద్యాసంస్థల్లో హిజాబ్‌ తప్పని సరికాదు :  కర్నాటక హైకోర్ట్‌ తీర్పు
Karnataka High Court : హిజాబ్‌ వివాదంపై కర్నాటక హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.

Karnataka High Court : హిజాబ్‌ వివాదంపై కర్నాటక హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ముస్లిం సంప్రదాయాల్లో హిజాబ్‌ ధరించడం తప్పనిసరి కాదని పేర్కొంది. విద్యాసంస్థల్లో యూనిఫాంను హైకోర్టు సమర్థించింది.హిజాబ్‌ అంశంపై దాఖలైన పిటీషన్లన్నిటిని కొట్టేసింది కర్ణాటక హైకోర్టు. కర్నాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం.. హిజాబ్‌ వివాదంపై నెల రోజులు సుదీర్ఘంగా విచారించింది. హిజాబ్ కేసులో 11 రోజులపాటు వరుసగా విచారణ చేపట్టంది. ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసిన కర్ణాటక హైకోర్టు ... ఇవాళ చారిత్రాత్మక ఇచ్చింది.

ఈ ఏడాది జనవరి 1న కర్నాటకలో హిజాబ్ వివాదం ప్రారంభమైంది. మంగళూరు జిల్లా ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కాలేజీలో.. హిజాబ్‌తో వచ్చిన ఆరుగురు విద్యార్థినులను కాలేజీ యాజమాన్యం క్లాసులకు అనుమతించలేదు. దీంతో వివాదం రాజుకుంది. హిజాబ్ ధరించడం అనేది కాలేజీ యూనిఫాం నియమాలకు విరుద్ధమని కాలేజీ యాజమాన్యం వాదించింది. దీనిపై కర్నాటకవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి.

హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్ధినులకు పోటీగా.. హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు, జెండాలు ఊపుతూ కాలేజీలు, స్కూల్స్ క్యాంపస్‌లలో హల్ చల్ చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్‌ను అనుమతించినట్లయితే వారి మతపరమైన దుస్తులు, చిహ్నాలను ప్రదర్శించడానికి కూడా అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. చివరికి ఈ వివాదం కోర్టుకు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story