ఫుడ్‌స్టాల్‌ని సందర్శించి.. అభిమానిని ఆశ్చర్యపరిచి.. సోనూ సహృదయం

ఫుడ్‌స్టాల్‌ని సందర్శించి.. అభిమానిని ఆశ్చర్యపరిచి.. సోనూ సహృదయం
వీలైతే మీరు ఒకసారి నా స్టాల్‌ని సందర్శించగలరు అన్న పోస్ట్ చూసి సోనూ రెక్కలు కట్టుకుని వాలిపోయారు..

బాలీవుడ్ నటుడు సోను సూద్ శుక్రవారం రోడ్‌సైడ్ ఫుడ్ స్టాల్‌ను సందర్శించి అభిమానిని ఆశ్చర్యపరిచారు. "అనిల్ ఏర్పాటు చేసిన స్టాల్‌ను నేను సోషల్ మీడియాలోచూశాను. ఈ స్టాల్‌లో ఆహారాన్ని వ్యక్తిగతంగా రుచి చూడాలని భావించాను. ఈ రోజు నేను సందర్శించే అవకాశం వచ్చింది. నేను ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్, మంచూరియా తిన్నాను. "

స్టాల్ యజమాని అనిల్ .. సోనూ సూద్‌ని చూసి ఆశ్చర్యపోయాడు. మీరు రావడం నిజంగా నా అదృష్టం సర్ అంటూ ఉప్పొంగి పోయాడు.. హైదరాబాద్ బేగం పేటలో ''లక్ష్మీ సోనూసూద్ ఫాస్ట్‌ఫుడ్'' పేరుతో స్టాల్‌ను ఏర్పాటు చేసిన అనిల్ ట్విట్టర్ వేదికగా.. సార్ మీ ఇన్‌స్పిరేషన్‌తో.. మీ పేరు పెట్టి ఈ స్టాల్ ఏర్పాటు చేస్తున్నాను.. వీలైతే మీరు ఒకసారి నా స్టాల్‌ని సందర్శించగలరు అన్న పోస్ట్ చూసి సోనూ రెక్కలు కట్టుకుని వాలిపోయారు.. కష్టకాలంలో అనిల్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోని వంటకాల రుచులను ఆస్వాదించారు. సామాజిక సేవ చేస్తున్న సోనూ సార్ నుండి నేను నిజంగా ప్రేరణ పొందాను. ఈ ప్రేరణతో నేను ఈ సోనూ సూద్ ఫాస్ట్‌ఫుడ్ స్టాల్‌ను సెటప్ చేసాను" అని అతను మీడియాకు వివరించాడు.

తన ఉచిత సేవా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం చేయడంలో ముందున్న సోనూ సూద్‌కి ఇటీవల సిద్దిపేటలోని ఒక స్థానిక పౌరుడు గుడి కట్టించి సోనూ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. దీని గురించి మాట్లాడిన సోనూ "నేను సిద్దిపేటలోని ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజలు చాలా ప్రేమను చూపించినందుకు నేను సంతోషంగా ఉన్నాను. నేను ఖచ్చితంగా సిద్దిపేటలోని గ్రామాన్ని సందర్శిస్తాను. నేను చాలా సామాన్యుడిని, ఆలయం కాదు కావలసింది.. ప్రజల ప్రేమని, అభిమానాన్ని కాపాడుకోవాలి అని ఆయన అన్నారు.

'ఐ యామ్ నో మెస్సీయ' పేరుతో తన ఆత్మకథ పుస్తకం గురించి మాట్లాడిన సూద్, ఈ పుస్తకం మహమ్మారి సమయంలో విజయవంతంగా ఇంటికి తిరిగి చేరిన వ్యక్తుల గురించి ఉంటుంది అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story