ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణాల స్కామ్‌లో కీలక పరిణామం

ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణాల స్కామ్‌లో కీలక పరిణామం

ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణాల స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌ భర్త, వ్యాపారవేత్త అయిన దీపక్‌ కొచ్చర్‌ అరెస్ట్‌ అయ్యారు. రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారంటూ నమోదైన మనీలాండరింగ్‌ కేసులో ఆయన్ను విచారించిన ఈడీ అధికారులు.. ఆధారాలు లభ్యమవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు.

వీడియో కాన్‌ గ్రూప్‌నకు 1875 కోట్ల మేర రుణాల మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారంటూ చందా కొచ్చర్‌ దంపతులతో పాటు వీడియోకాన్‌ గ్రూప్‌నకు చెందిన వేణుగోపాల్‌ దూత్‌పైనా ఆరోపణలున్నాయి. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద గతేడాది జనవరిలో ఈడీ వీరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఐసీఐసీఐ బ్యాంకు చందా కొచ్చర్‌ను సీఈవో పదవి నుంచి కూడా తప్పించింది. ఈ కేసులో పలుమార్లు విచారించిన ఈడీ.. తాజాగా దీపక్‌ కొచ్చర్‌ను అరెస్టు చేసింది. అలాగే, చందా కొచ్చర్‌ హయాంలో గుజరాత్‌లోని స్టెర్లింగ్‌ బయోటెక్‌ ఫార్మా కంపెనీ, భూషణ్‌ స్టీల్‌ గ్రూప్‌కు ఐసీఐసీఐ నుంచి రుణాలు మంజూరు చేయడంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపైనా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story