Swati Dumane: విధులు నిర్వహిస్తుండగా ఎదురొచ్చిన పులి.. అయినా వెనకడుగు వేయని లేడీ ఆఫీసర్..

Swati Dumane (tv5news.in)

Swati Dumane (tv5news.in)

Swati Dumane: కొన్ని ఉద్యోగాలు జీతాన్ని, గుర్తింపును మాత్రమే కాదు.. ప్రాణహానిని కూడా ఇస్తాయి.

Swati Dumane: కొన్ని ఉద్యోగాలు జీతాన్ని, గుర్తింపును మాత్రమే కాదు.. ప్రాణహానిని కూడా ఇస్తాయి. అయినా కూడా కొందరు వీరులు ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఉద్యోగం చేస్తారు. సరిహద్దుల్లో ఉన్న సైనికులకే కాదు.. ఇంకా చాలా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తు్న్న వారికి కూడా క్షణక్షణం పలు రకాల ఆపదలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ వారు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా పనిచేస్తారు. అలా పనిచేసి ప్రాణాలు అర్పించిన వారిలో ఒకరే స్వాతి డుమేన్.

స్వాతి డుమేన్.. ఒక సీనియర్ ఫారెస్ట్ ఆఫీసర్. ఫారెస్ట్ ఆఫీసర్ పోస్ట్ అంటే మామూలు విషయం కాదు. అడవిని పరిరక్షించడం కోసం ఎప్పుడు అడవిలోనే ఉండాలి. ప్రాణాలు తీసే జంతువులు ఉంటాయని తెలిసి కూడా అక్కడే జీవనం సాగించాలి. మూగ జీవాలైనా, మృగాలైనా.. అన్నింటిని సంరక్షించాలి. ఈ క్రమంలో వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

మగవారు చేసిన పనిని ఆడవారు చేయలేరు అని ఇప్పటికీ కొంతమంది స్త్రీల గురించి తక్కువ చేసి మాట్లాడతారు. కానీ స్వామి డుమేన్‌ను చూస్తే వారు కచ్చితంగా మాట మారుస్తారు. ఫారెస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న స్వాతి పులుల గురించి సర్వే చేయడానికి అడవిలోకి వెళ్లారు. కానీ ఆ పులి పంజాకే బలయ్యారు. పులుల సంరక్షణ కోసం పాటుపడుతున్న ఆమె.. ఆఖరికి ఆ పులికే ఆహారమవ్వడం అందరినీ కలచివేసింది.

పులులు, సింహాలకు వేటాడం మాత్రమే తెలుసు.. వాటి రక్షణ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు.. వాటికి చెడు చేయాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు అనే ఆలోచన వాటికి ఉండదు. అయినా అలాంటి ప్రాణులను కాపాడుకునే బాధ్యత మనకు ఉంది అని నమ్మి పనిచేసే ఫారెస్ట్ ఆఫీసర్‌లలో ఒకరు స్వాతి డుమేన్. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 సర్వే కోసం మహారాష్ట్రలోని తడోబా అంధేరి టైగర్ రిజర్వ్‌‌కు వెళ్లిన స్వాతి అక్కడే పులి పంజాకు బలై శవమై తిరిగొచ్చారు.

స్వాతి డుమేన్ ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. మహిళ అయ్యిండి ఇలాంటి రిస్క్ ఉన్న ఉద్యోగాన్ని ఎంచుకోవడం ఒక ఎత్తు అయితే.. పులులు ఉంటాయని తెలిసి ఆ అడవిని సంరక్షించుకుంటున్న ఆమె డెడికేషన్ మరో ఎత్తు అనుకుంటున్నారు ఈ విషయం తెలిసినవారు. ఆమె త్యాగానికి 'ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అసోసియేషన్' సెల్యూట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story