Corona Vaccine : చరిత్ర సృష్టించిన భారత్..వంద కోట్ల మార్కును దాటిన టీకాల పంపిణీ..!

Corona Vaccine : చరిత్ర సృష్టించిన భారత్..వంద కోట్ల మార్కును దాటిన టీకాల పంపిణీ..!
Corona Vaccine : కోవిడ్‌ వ్యాక్సిన్ల పంపిణీలో భారత్‌ చరిత్ర సృష్టించింది. కోవిడ్‌ మెగా వ్యాక్సినేషన్‌ వందకోట్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది

Corona Vaccine : కోవిడ్‌ వ్యాక్సిన్ల పంపిణీలో భారత్‌ చరిత్ర సృష్టించింది. కోవిడ్‌ మెగా వ్యాక్సినేషన్‌ వందకోట్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమైన 9 నెలల్లోనే దేశవ్యాప్తంగా 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ల పంపిణీ రికార్డును అందుకుంది. నేడు 100కోట్ల మైలురాయిని అధిగమించింది. వంద కోట్ల కోవిడ్‌ డోసులు అందించిన రెండో దేశంగా భారత్‌ కీర్తి గడించింది.

దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఈ ఏడాది జనవరి 16న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభించారు. తొలి దశలో కరోనా పోరులో ముందున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్లు వేశారు. ఆ తర్వాత వృద్ధులకు, ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి, మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ వ్యాక్సిన్లు ప్రారంభించారు. ఇప్పటివరకు దేశంలో 75 శాతం మందికి కోవిడ్‌ టీకాలు వేయడం పూర్తయింది.

వ్యాక్సిన్‌ డ్రైవ్‌ప్రారంభమైన తొలినాళ్లలో ప్రజల్లో నెలకొన్న భయాలు, ఇతరత్రా కారణాలతో టీకాల పంపిణీ నెమ్మదిగా సాగింది. అయితే మార్చి తర్వాత వ్యాక్సినేషన్‌ ఊపందుకుంది. జూన్‌ నెలాఖరులో రోజుకు 40లక్షల డోసులు పంపిణీ చేయగా.. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబరు 17న ఒక్కరోజే ఏకంగా రెండున్నర కోట్ల డోసులను అందించారు.

అక్టోబరు 21న నాటికి 100కోట్ల డోసుల మార్క్‌ను దాటేసింది. జమ్మూకాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, దాద్ర-నగర్ హావేలి, డామన్- డియూ, గోవా, లక్షద్వీప్ లలో వందశాతం మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తయింది.

Tags

Read MoreRead Less
Next Story