కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండో స్థానానికి చేరిన భారత్..!

కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండో స్థానానికి చేరిన భారత్..!
కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది. అమెరికా తర్వాతి స్థానం మనదే. ఇప్పటిదాకా రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌ను భారత్ దాటేసింది.

కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది. అమెరికా తర్వాతి స్థానం మనదే. ఇప్పటిదాకా రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌ను భారత్ దాటేసింది. 3 కోట్ల 19 లక్షల 18 వేల మంది కరోనా బాధితులతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో కేసులు వేగంగా పెరుగుతుండడంతో ప్రస్తుతం ఆ సంఖ్య కోటి 35 లక్షల 28 వేలకు చేరింది. బ్రెజిల్‌లో కరోనా బాధితులు కోటి 34 లక్షల 83 వేల మంది ఉన్నారు.

కేసుల పరంగా రెండో స్థానంలో ఉన్న భారత్... కరోనా మరణాల పరంగా మాత్రం నాలుగో స్థానంలో ఉంది. అమెరికాలో కరోనా మహమ్మారి ఇప్పటివరకు 5 లక్షల 76 వేల మందిని బలితీసుకుంది. మరణాల సంఖ్యలో మాత్రం బ్రెజిల్‌ సెకండ్‌ ప్లేస్‌లోనే ఉంది. ఇక్కడ 3 లక్షల 54 వేల మంది కరోనాకు బలయ్యారు. డెత్ రేట్‌లో మెక్సికో మూడో స్థానంలో ఉంది. ఆ దేశంలో ఇంతవరకు 2 లక్షల 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో కరోనా మృతుల సంఖ్య ఒక లక్షా 70 వేలు.

మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతోపాటు మరణాలు కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 904 మంది ప్రాణాలు కోల్పోయారు. మొన్నటి వరకు మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ వంటి కొన్ని రాష్ట్రాల్లోనే కేసుల సంఖ్య విపరీతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఛత్తీస్‌ఘడ్, పంజాబ్‌ రాష్ట్రాల్లోనూ కేసులు భారీగా పెరిగాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మహమ్మారి విజృంభిస్తోంది.

కేసులు కంట్రోల్ కాకపోవడంతో మరోసారి పూర్తి లాక్‌డౌన్ పెట్టాలని మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, కంటైన్‌మెంట్‌ జోన్లను అమలు చేస్తున్నాయి. తెలంగాణ సర్కారు మాస్కును తప్పనిసరి చేసింది. నిబంధనలు ఉల్లంఘించినవారికి వెయ్యి రూపాయల జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story