IndiGo Air Hostess: ఎన్నో అందమైన జ్ఞాపకాలు.. అన్నీ వదిలేసి వెళుతున్నా: ఎయిర్ హోస్టెస్ కన్నీళ్లు

IndiGo Air Hostess: ఎన్నో అందమైన జ్ఞాపకాలు.. అన్నీ వదిలేసి వెళుతున్నా: ఎయిర్ హోస్టెస్ కన్నీళ్లు
IndiGo Air Hostess: ఇండిగో ఎయిర్ హోస్టెస్ వీడ్కోలు సందర్భంగా కన్నీళ్లు పెట్టుకుంది.

IndiGo Air Hostess: ఇండిగో ఎయిర్ హోస్టెస్ ఫ్లైయర్‌లకు వీడ్కోలు సందర్భంగా కన్నీళ్లు పెట్టుకుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌లోని పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్‌పై మాట్లాడుతూ, ప్రతి ఫ్లైయర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. వీడ్కోలు చెప్పడం జీవితంలో కష్టమైన విషయాలలో ఒకటి అని ఆమె తెలిపారు. ఈ వీడియోలో, ఇండిగో ఫ్లైట్ అటెండెంట్ తన చివరి పని రోజున ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కన్నీరు పెట్టుకున్నారు.

తాను కంపెనీని విడిచిపెట్టాలనుకోవడం లేదని, కానీ వెళ్లాలి తప్పదు అని అన్నారు. ఈ వీడియోను సింగర్, రేడియో జాకీ అమృత సురేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి 3.78 లక్షలకు పైగా వీక్షణలు, చాలా ప్రశంసలు వచ్చాయి.

"నాకు వెళ్ళాలని లేదు, కానీ వెళ్లక తప్పదు" "ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు," అని కొద్దిసేపు ఆగి, ఆపై తన కంపెనీకి వారి ఉద్యోగులను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. "ముఖ్యంగా మేము అమ్మాయిలం" మాకు, మా పనికి గౌరవం ఇస్తూ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అని ఇండిగో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

"అందరికీ ధన్యవాదాలు. మాతో కలిసి ప్రయాణించే ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ వల్ల, మేము మా విమానాల మాదిరిగానే సమయానికి లేదా సమయాని కంటే ముందే జీతాలు తీసుకుంటాము" అని ఆమె తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పలువురు ఇండిగో ఫ్లైట్ ప్రయాణీకులు ఆమెను ఎయిర్ హోస్టెస్ సురభిగా గుర్తించారు.

సురభి "మీరు అద్భుతమైన వ్యక్తి. ప్రయాణీకులపట్ల మీరు చాలా దయతో వినయంతో ఉండేవారు. మీరు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ సౌకర్యవంతంగా ఉండేలా చేసారు. మీ మొహంలో ఎప్పుడూ చెరగని చిరునవ్వు. మీ తదుపరి జీవితం మరింత అందంగా ఉండాలని కోరుకుంటున్నాము, ఆల్ ది బెస్ట్ అని పోస్టులు పెడుతున్నారు. నేను మీతో ప్రయాణించడం మిస్ అవుతున్నాను. కానీ ఇప్పటికీ మీతో చాలా అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి, "అని మరొక ప్రయాణీకుడు రాసుకొచ్చారు.

సురభి.. మీ వీడ్కోలు ప్రసంగం హృదయాన్ని హత్తుకునేలా ఉంది అని మరొకరు వ్యాఖ్యానించారు. పని చేసే చివరి రోజున ఆమె తన కంపెనీ గురించి గొప్పగా మాట్లాడడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం అని మరొకరు పేర్కొన్నారు. చాలా మంది ఉద్యోగులు సంస్థను వదిలి వెళుతున్న సురభి గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఆమెకు సంస్థ పట్ల అపారమైన గౌరవం ఉందని ఇండిగో యాజమాన్యం సురభిని ప్రశంసించింది.

Tags

Read MoreRead Less
Next Story