కొండెక్కిన కోడిగుడ్డు.. ఒక గుడ్డు ధర రూ.30

కొండెక్కిన కోడిగుడ్డు.. ఒక గుడ్డు ధర రూ.30
జనాభాలో 25% కంటే ఎక్కువ మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు

'కొత్త పాకిస్తాన్'ను నిర్మిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన పీఎం ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ దీన స్థితిలో ఉంది. ద్రవ్యోల్బణం దేశంలో వినాశనాన్ని సృష్టించింది. కూరగాయలు, పప్పుధాన్యాలు సహా గుడ్ల ధరలు కూడా మండుతున్నాయి. ఒక గుడ్డు ధర రూ. 30, ఒక కిలో చక్కెర 104 రూపాయలు, ఒక కిలో గోధుమ 60 రూపాయలు, అల్లం కిలోకు 1000 రూపాయల చొప్పున పలుకుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం చక్కెర ధరలను తగ్గించినట్లు పిఎం ఇమ్రాన్ పేర్కొన్నారు. అయితే పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం అన్ని రికార్డులను బద్దలుకొట్టింది. పాకిస్తాన్ యొక్క ప్రముఖ వార్తాపత్రిక 'ది డాన్' ప్రకారం, దేశంలోని చాలా ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం వల్ల గుడ్డు ధర డజనుకు 350 పాకిస్తాన్ రూపాయలకు (సుమారు 160 భారతీయ రూపాయలు) పెరిగింది. పాకిస్తాన్ జనాభాలో 25% కంటే ఎక్కువ మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. ఈ జనాభా వారి ఆహారంలో గుడ్లను ఎక్కువగా వాడతారు.

గత ఏడాది డిసెంబర్‌లో దేశంలో పరిస్థితి మరింత దిగజారింది. గోధుమ ధర పదేళ్ల క్రిత కిలో రూ. 40 లు ఉంటే.. 2020 లో ఈ రికార్డు బద్దలైంది. ఇప్పుడు గోధుమలను కిలో రూ. 60 లకు అమ్ముతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story