Jammu And Kashmir : గత 18 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్

Jammu And Kashmir : గత 18 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్
Jammu And Kashmir : శ్రీనగర్‌లో నిన్న ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి.

Jammu And Kashmir : గత 18 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్జమ్మూకాశ్మీర్‌లో టెన్షన్‌ వాతావరణం చోటు చేసుకుంది. శ్రీనగర్‌లో నిన్న ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో ఆర్మీ సిబ్బందికి ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అయితే ఉగ్రవాదులు పారిపోయారని అధికారులు తెలిపారు.

శ్రీనగర్‌లోని బెమీనా ప్రాంతంలోని స్కిమ్స్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు స్థానిక పౌరులను ఉపయోగించుకుని తప్పించుకున్నారని శ్రీనగర్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటనాస్థలికి అదనపు పోలీసు బృందాలు చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూక భారత్‌లో ఉన్న స్లీపర్ సెల్స్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఉగ్రవాద అనుబంధ సంస్థలను ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రేరేపిస్తూ జమ్మూకాశ్మీర్లో జనజీవనాన్ని ఇబ్బంది పెడుతున్నారు. జమ్ము కాశ్మీర్‌‌లో సామాన్య పౌరులను మట్టు పెడుతున్నారు.

ఈ క్రమంలో భారత ఆర్మీ జమ్ము కాశ్మీర్ పరిరక్షణ కోసం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఇక్కడ కొద్ది రోజులుగా సుదీర్ఘ ఆర్మీ ఆపరేషన్ జరుగుతోంది. పూంచ్ అడవుల్లో దాగి ఉన్నారని భావిస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టడం కోసం గత 18 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story