భార్య కోరిక నెరవేర్చేందుకు బైక్ పై 1000 కిలోమీటర్లు..

భార్య కోరిక నెరవేర్చేందుకు బైక్ పై 1000 కిలోమీటర్లు..
ఎక్కువ చదువుకుంటే ఎక్కడి నుంచి తేవాలి అంతకంటే ఎక్కువ చదువుకున్నోడిని.. అని అమ్మాయికి చదువు పట్ల ఉన్న కోరికని చంపేసి మూడు ముళ్లు వేయించారు..

అంతగా చదువుకోవాలనుకుంటే పెళ్లయ్యాక చదువుకో మీ ఆయన ఒప్పుకుంటే.. ఇంకా ఎక్కువ చదువుకుంటే ఎక్కడి నుంచి తేవాలి అంతకంటే ఎక్కువ చదువుకున్నోడిని.. అని అమ్మాయికి చదువు పట్ల ఉన్న కోరికని చంపేసి మూడు ముళ్లు వేయించారు సోనీ తల్లిదండ్రులు. అర్థం చేసుకునే భర్త దొరికాడు.. ఆమెను తాను చదివిస్తానన్నాడు.. నేను చదువుకోలేకపోయాను నువ్వైనా చదువుకో.. నీ కల నెరవేర్చుకో అని చెప్పాడు. ఏడు నెలల గర్భవతి అయిన భార్యను బైక్ పై కూర్చోపెట్టుకుని 1000 కిలోమీటర్లు ప్రయాణించి పరీక్ష రాయించాడు.

జార్ఘండ్ గొడ్డా నగరానికి చెందిన ధనుంజయ్ కుమార్ 10వ తరగతి పాసై కుక్ గా పనిచేస్తున్నాడు. అతడికి సోనీ హెంబ్రామ్ తో వివాహం జరిగింది. టీచర్ కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు మధ్యప్రదేశ్ బోర్డు అందించే ప్రాథమిక విద్య డిప్లొమా కోర్సులో చేరింది. ప్రస్తుతం సెకండియర్ పరీక్షలు జరుగుతున్నాయి. గ్వాలియర్ లో పరీక్ష సెంటర్ వచ్చింది. గొడ్డా నుంచి పరీక్ష రాసేందుకు వెళ్లాలంటే 11 కిలోమీటర్లు ప్రయాణించాలి. వెళ్లేందుకు రైళ్లు అందుబాటులో లేవు. బండి మీద వెళ్ళాలని నిర్ణయించుకున్నారు భార్యాభర్తలిద్దరూ. నాలుగు నెలలుగా ధనుంజయ్ కి ఉద్యోగం లేదు. జీతం రావట్లేదు. దాంతో బంధువుల దగ్గర రూ.10వేలు అప్పు చేసి భార్యను పరీక్ష రాయించడానికి బయలుదేరాడు ధనుంజయ్. ఆగస్టు 27 రాత్రి బయలు దేరి ఆగస్టు 30 సాయింత్రానికి గ్వాలియర్ చేరుకున్నారు. అక్కడ రూ.1500 లతో ఒక గది అద్దెకు తీసుకున్నారు. పరీక్షలు పూర్తయ్యేసరికి రూ.7,000 లు ఖర్చయిపోయాయి. ఇంకా రూ.3,000 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు తిరిగి వాళ్ల ఊరు వెళ్లడానికి తగిన డబ్బు సమకూర్చునే ప్రయత్నం చేస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story