భారీ ఉగ్రదాడికి జరిగిన కుట్రను భగ్నం చేసిన జమ్మూ పోలీసులు

భారీ ఉగ్రదాడికి జరిగిన కుట్రను భగ్నం చేసిన జమ్మూ పోలీసులు

భారీ ఉగ్రదాడికి జరిగిన కుట్రను జమ్మూ పోలీసులు భగ్నం చేశారు. నిత్యం రద్దీగా ఉండే జమ్మూ బస్టాండు సమీపంలో 7 కిలోల శక్తివంతమైన పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ప్రమేయముందని అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఛండీగఢ్‌కు చెందిన సుహైల్‌‌తో పాటు ఖాజీ అనే మరో వ్యక్తిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఫుల్వాలా దాడి ఘటనకు రెండేళ్లు అయిన సందర్భంగా.. ఉగ్రవాద సంస్థలు దాడులకు ప్లాన్ చేస్తున్నాయనే సమాచారంతో గత రెండు మూడు రోజులుగా చాలా అప్రమత్తంగా ఉన్నామని పోలీసులు తెలిపారు. సుహైల్ అనే వ్యక్తిని పుల్వామాలో పట్టుకున్నామని వెల్లడించారు.

అతని దగ్గర నుంచి 6.5 కిలోల ఐఈడీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఐఈడీని అమర్చాల్సిందిగా పాకిస్థాన్‌కు చెందిన అల్ బదర్ తాంజీమ్ నుంచి తమకు సందేశం వచ్చినట్టు విచారణలో సుహైల్ వెల్లడించాడు. రఘునాథ్ ఆలయం, లేక్‌దత్త బజార్, జమ్మూ రైల్వేస్టేషన్‌లు ఉగ్రవాదుల టార్కెట్‌గా ఉన్నాయన్నారు. అటు.. సాంబ జిల్లాలోనూ 15 చిన్న ఐఈడీలు, ఆరు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ద్వారా వీటిని జారవిడిచినట్టు అనుమానిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story