Kamal Haasan : వారంతా ద్రోహులంటూ కమల్‌ హాసన్‌ సంచలన వ్యాఖ్యలు..!

Kamal Haasan : వారంతా ద్రోహులంటూ కమల్‌ హాసన్‌ సంచలన వ్యాఖ్యలు..!
ఇటీవల వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఇటీవల వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడా పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే ఆ పార్టీని పలువురు వీడగా.. తాజాగా పార్టీలో నెంబర్ 2 అని చెప్పుకునే ఉపాధ్యక్షుడు ఆర్‌.మహేంద్రన్ సైతం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌కు పలు కారణాలను వివరిస్తూ లేఖ రాశారు.

అయితే ఆయన రాజీనామా పట్ల కమల్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆయన్ను 'ద్రోహి'గా అభివర్ణించారు. మహేంద్రన్‌ రాజీనామా చేయకపోయినా.. తామే పార్టీ నుంచి తొలగించేవారమని అన్నారు. పార్టీ నుంచి ఓ 'కలుపు మొక్క' బయటకు వెళ్లిందని.. దానికి తాము హర్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. కొంతమంది రాజీనామా వల్ల పార్టీ లక్ష్యం మాత్రం మారదని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా ఎన్నికల ఫలితాల్లో 234స్థానాలకి గాను డీఎంకే 133స్థానాలను గెలుచుకుంది. అన్నాడీఎంకే 66, కాంగ్రెస్‌ 18, పీఎంకే 5, బీజేపీ 4 స్థానాలకే పరిమితమయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story