కర్ణాటకలో రేపట్నుంచి సంపూర్ణ లాక్ డౌన్

కర్ణాటకలో రేపట్నుంచి సంపూర్ణ లాక్ డౌన్
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో 14 రోజల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించింది.

కర్ణాటక వ్యాప్తంగా రేపటి నుంచి లాక్ డౌన్ పెడుతున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. రేపు రాత్రి నుంచి 14 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది. మే 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని పేర్కొంది. అయితే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అత్యవసర సేవలకు అనుమతి ఇచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం యడియూరప్ప వెల్లడించారు.

అయితే, నిర్మాణ రంగంతోపాటు, ఉత్పత్తి, వ్యవసాయ రంగాలకు లాక్‌ డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది యడ్యూరప్ప ప్రభుత్వం.. లాక్‌ డౌన్‌ సమయంలో ప్రజా రావాణాపై పూర్తిగా ఆంక్షలు విధించింది.. అంతర్‌ జిల్లాతోపాటు అంతర్‌ రాష్ట్ర సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి.. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.. మరోవైపు ఆల్కహాల్‌ హోం డెలివరీకి మాత్రం అనుమతులు ఇచ్చింది కర్నాటక ప్రభుత్వం..

అటు కర్నాటకలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ వేయించనున్నట్లు యడ్యూరప్ప ప్రకటించారు.. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ వేయిస్తామన్నారు. నిన్న ఒక్కరోజే కర్నాటకలో 34వేలా 804 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.. 143 మంది చనిపోయారు..

బెంగళూరులో పరిస్థితి ఘోరంగా ఉంది. రోజూ వేలకొద్దీ కేసులునమోదవుతున్నాయి..నిన్న ఒక్కరోజే 24వేలకుపైగా కేసులు వెలుగు చూశాయి.. మొత్తంగా చూస్తే కర్నాటకలో పరీక్షలు చేయించుకున్న ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా సోకుతోంది. మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో లాక్‌ డౌన్‌ నిర్ణయం తీసుకుంది యడియూరప్ప ప్రభుత్వం.

Tags

Read MoreRead Less
Next Story