పన్నెండేళ్ల బాలుడికి తరచు జ్వరం.. వైద్యులు షాక్

పన్నెండేళ్ల బాలుడికి తరచు జ్వరం.. వైద్యులు షాక్
ఎంతమంది డాక్టర్లకు చూపించినా తగ్గట్లేదు. ఆఖరికి ఓ వైద్యుడు..

పన్నెండేళ్ల బాబుకి పదే పదే జ్వరం.. ఎంతమంది డాక్టర్లకు చూపించినా తగ్గట్లేదు. ఆఖరికి ఓ వైద్యుడు.. బాలుడి గుండెలో గుండుసూది ఉందని అందుకే తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడని వివరించారు. కర్ణాటకలోని మంగళూరు నగరంలో బజార్ పక్కలడ్కకి వీధికి చెందిన అబ్దుల్ ఖాదర్ కుమారుడు ముఖశ్కీర్‌కు ఎప్పుడూ జ్వరం వస్తుండేది.

డాక్టర్‌కి చూపిస్తే జ్వరం తగ్గడానికి మందిచ్చే వారు. అయితే మందు వేసుకున్నప్పుడు జ్వరం తగ్గేది. మళ్లీ వారం రోజులకి జ్వరం వచ్చేది. ఏంటో అర్థం కాక అమ్మానాన్న ఆందోళన చెందేవారు. ఇరుగు పొరుగు సలహాతో బాబుని మంగళూరులోని చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్ రామ్‌గోపాలశాస్త్రి వద్దకు తీసుకెళ్లారు.

ఎక్స్‌రే తీసి పరిశీలించగా హృదయ భాగంలో గుండు సూది ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే వైద్యులు అప్రమత్తమై బాలుడికి శస్త్రచికిత్స చేసి గుండుసూదిని బయటకు తీసి అతడి ప్రాణాలు కాపాడారు.

Tags

Read MoreRead Less
Next Story