జీవితం అంటే అలాగే ఉంటుంది.. చచ్చిపోవాలనే ఆలోచన మానుకో : మంత్రి

జీవితం అంటే అలాగే ఉంటుంది.. చచ్చిపోవాలనే ఆలోచన మానుకో : మంత్రి
స్కూలు ఫీజు కట్టకపోవటంతో అతడ్ని తన తోటి విద్యార్థుల ముందు తిట్టడమే కాకుండా పరీక్షలు రాయటానికి ఒప్పుకోలేదు స్కూలు యజమాన్యం.

బెంగుళూరులోని HRS లేఅవుట్‌లోని ఓ స్కూల్లో పదవ తరగతి చదువుకుంటున్నఓ 17 ఏళ్ల బాలుడు.. స్కూలు ఫీజు కట్టకపోవటంతో అతడ్ని తన తోటి విద్యార్థుల ముందు తిట్టడమే కాకుండా పరీక్షలు రాయటానికి ఒప్పుకోలేదు స్కూలు యజమాన్యం. దీనితో మనస్తాపానికి గురైన ఆ బాలుడు.. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించాడు. అయితే దీనిని గుర్తించిన అతడి కుటుంబ సభ్యులు అతన్నీ కాపాడారు.

అతంటితోనే ఆ కథ అయిపోలేదు. బాలుడి ఆత్మహత్యాయత్నం విషయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్‌కుమార్‌ దృష్టికి వెళ్లింది. దీనితో నేరుగా గురువారం విధ్యార్ది ఇంటికే వెళ్లారు మంత్రి. అక్కడ ఆ బాలుడితో మాట్లాడుతూ దైర్యం చెప్పారు. నీకేమైనా అయితే మీ అమ్మానాన్న, సోదరి ఏమైపోతారో ఎప్పుడైనా ఆలోచించావా? జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఎదురించాలి.. పోరాడాలి. ముందుగా చచ్చిపోవాలనే ఆలోచనలు మానుకోవాలి.. జీవితం అంటే అలా ఉంటుందని, కష్టాలు వచ్చినపుడు గుండె ధైర్యం కోల్పోకూడదని ఆ బాలుడికి దైర్యం చెప్పారు మంత్రి!

Tags

Read MoreRead Less
Next Story