Hijab controversy : విద్యాసంస్థలకి మూడు రోజలు పాటు సెలవులు ప్రకటించిన కర్నాటక ప్రభుత్వం..!

Hijab controversy : విద్యాసంస్థలకి మూడు రోజలు పాటు సెలవులు ప్రకటించిన కర్నాటక ప్రభుత్వం..!
Hijab controversy : కర్నాటకలో హిజాబ్‌ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉడిపి జిల్లాలో చిన్న ఘటనతో ప్రారంభమైన వివాదం రాష్ట్రమంతా పాకింది.

Hijab controversy : కర్నాటకలో హిజాబ్‌ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉడిపి జిల్లాలో చిన్న ఘటనతో ప్రారంభమైన వివాదం రాష్ట్రమంతా పాకింది. ఉడిపి, మాండ్య, శివమొగ్గ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉడుపి, మాండ్య జిల్లాల్లో విద్యార్థి వర్గాల మధ్య దాడులు జరిగాయి. శివమొగ్గలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాల పరిసర ప్రాంతాల్లో.. నిరసన తెలుపుతున్నవిద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు.. కాలేజీ సమీపంలోని ప్రైవేటు బస్సులపై రాళ్లు రువ్వారు. ఈ ఘర్షణల్లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో శివమొగ్గలో 144 సెక్షన్ విధించి.. అదనపు పోలీసు బలగాలను మోహరించారు. అటు ఉడిపిలోని మహాత్మాగాంధీ మెమోరియల్ కాలేజీలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల విద్యార్థులు పోటాపోటీగా నిరసనలకు దిగారు. జైశ్రీరామ్, అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఉడిపి వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పోలీస్‌ బలగాలను మోహరించారు.

నెలరోజులుగా కర్నాటకలో హిజాబ్‌ వివాదం నడుస్తోంది. ఉడిపిలో హిజాబ్‌ ధరించి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను.. ప్రిన్సిపల్‌ అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అటు.. అంతా సమానమే అన్న కర్నాటక ప్రభుత్వం.. పాఠశాలలు, కాలేజీల్లో మతం ఆధారంగా వస్త్రధారణ కుదరదని తేల్చిచెప్పింది. దీనిపై బ్యాన్‌ కూడా విధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు హిజాబ్‌ ధరించి వచ్చిన విద్యార్థినులను.. ప్రత్యేక రూమ్‌లలో కూర్చోబెట్టారు. మరికొన్నిచోట్ల అడ్డుకున్నారు. అటు హిజాబ్‌ను వ్యతిరేకిస్తూ.. మరోవర్గం విద్యార్థులు కాషాయం ధరించి రావడంతో.. పాఠశాలు, కాలేజీల్లో యుద్ధ వాతారణం నెలకొంది. పలుచోట్ల రెండు వర్గాల మధ్య దాడులు జరిగాయి.

ఈ వివాదంపై మైనార్టీ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిజాబ్‌ తాము కొత్తగా ధరించేది కాదని.. చిన్నప్పటి నుంచీ తాము హిజాబ్‌ ధరిస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు దీన్ని వివాదం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. అటు మరో వర్గం విద్యార్థి సంఘాలు.. తమ డిమాండ్‌ను సమర్థించుకుంటున్నాయి. అంతా సమానమే అన్నప్పుడు కొందరికి ప్రత్యేక వెసులుబాటు ఏంటని ప్రశ్నిస్తున్నారు. సమానత్వం కోసమే తాము నిరసన తెలుపుతున్నామని అంటున్నారు.

హిజాబ్‌ వివాదం తీవ్రరూపంలో దాల్చడంతో.. రాష్ట్ర ప్రభుత్వం అప్పమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజలు పాటు సెలవులు ప్రకటించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థల యాజమాన్యాలు శాంతియుతంగా ఉండాలని.. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ట్విట్టర్‌ ద్వారా కోరారు. అటు హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. దీనిపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అల్లర్లు, వీధుల్లోకి వచ్చి నినాదాలు చేయడం, విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకోవడం మంచిది కాదని.. ఇవన్నీ ఎంతగానో కలచివేస్తున్నయని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story