Kerala: హట్సాఫ్ అమ్మా.. నీ మనసే బంగారం..

Kerala: హట్సాఫ్ అమ్మా.. నీ మనసే బంగారం..
Kerala: షెహ్నా తన వివాహాన్ని సాధారణంగా జరుపుకుని ఆ డబ్బుతో నిరుపేదలకు సాయం చేయాలనుకుంది.

Kerala: మూడుగంటల్లో ముగిసే తంతు అయినా పెళ్లంటే బోలెడంత ఖర్చు.. పట్టు బట్టలు, ఒంటి నిండా నగలు.. తమ హోదాని చాటుకునేందుకు భారీ కళ్యాణమండపం, అతిధులు అద్ధిరిపోయే విందు భోజనం. వెరసి పెళ్లి ఓ పెద్ద ప్రహసనం. బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు పెళ్లి వేడుకల గురించి నాలుగు రోజులు మాట్లాడుకోవాలంటే ఆమాత్రం ఉండాలి మరి.

కానీ కేరళకు చెందిన షెహ్నా షెరి అనే యువతి మాత్రం ఆర్థిక స్థోమత ఉన్నా తన పెళ్లికి నాన్న నగలు కొంటానంటే వద్దంది. పెళ్లి కూడా సింపుల్‌గా చేసుకుంటానంది.. ఆ డబ్బులను మంచి పనులు వినియోగిద్దామని తండ్రితో చెప్పింది. కొత్త కోడలి సలహాని అత్తింటి వారు కూడా స్వాగతించారు.

కోజికోడ్ జిల్లా మయపయ్యూర్‌కు చెందిన అంత్రు-రంలా దంపతుల కుమార్తె షెహ్నా షెరికి.. కొట్టపల్లికి చెందిన మహమ్మద్ షఫీతో పెళ్లి నిశ్చయమైంది. షెహ్నా తన వివాహాన్ని సాధారణంగా జరుపుకుని ఆ డబ్బుతో నిరుపేదలకు సాయం చేయాలనుకుంది.

ఆమె నిర్ణయాన్ని తల్లిదండ్రులు, అత్తింటివారు అభినందించారు. పెళ్లి తంతును నిరాడంబరంగా ముగించారు. పెళ్లి వేదికపైనే 21 సెంట్ల భూమిని నాలుగు నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేశారు. ఓ పేద వ్యక్తికి ఇంటిని నిర్మించి ఇచ్చారు. మరొకరికి ఆస్పత్రి చికిత్సకు డబ్బు అందించారు. ఓ పేదింటి అమ్మాయి వివాహ ఖర్చును భరించారు. దగ్గర్లోని డయాలసిస్ సెంటర్‌కు విరాళం ఇచ్చారు. షెహ్నా చేసిన మంచి పనికి అందరి నుంచి ప్రశంసలు అందుకుంది.

Tags

Read MoreRead Less
Next Story