Kerala: టీ కొట్టుతో ఆదాయం.. వృద్ధ దంపతుల వరల్డ్ టూర్..

Kerala: టీ కొట్టుతో ఆదాయం.. వృద్ధ దంపతుల వరల్డ్ టూర్..
Kerala: జీవితాన్ని అనుభవించడానికి వయసుతో సంబంధం లేదు. యవ్వనంలో ఉన్నప్పుడు డబ్బు సంపాదనలోనే బిజీగా బ్రతికేస్తాం.

Kerala: జీవితాన్ని అనుభవించడానికి వయసుతో సంబంధం లేదు. యవ్వనంలో ఉన్నప్పుడు డబ్బు సంపాదనలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ బ్రతికేస్తాం. కానీ ఆ యవ్వనంలో దాటిపోయాక తెలుస్తుంది డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉంటాయి. ఈ సత్యం తెలుసుకునేలోపే కొందరి జీవితం అయిపోతుంది. కానీ అదృష్టవశాత్తు కొందరు ముందే తెలుసుకుంటారు. అందుకేనేమో కేరళకు చెందిన ఈ వృద్ధ దంపతులు తన కాఫీ షాప్‌లో వచ్చిన ఆదాయంతోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.

మోహన, కేఆర్‌విజయన్.. వీరిద్దరికీ 50 ఏళ్లు పైనే ఉంటాయి. కేరళలోని కొచ్చిలో ఓ చిన్న కాఫీ షాప్ ఉంది. మన భాషలో చెప్పాలంటే అదొక టీ కొట్టు. మామూలుగా టీ కొట్టు వారి ఆదాయం ఎంతుంటుందిలే అని తీసిపారేస్తాం. కానీ వీరిద్దరు అదే సంపాదనతో ఇప్పటికే 25 దేశాలను సందర్శించారు. అలా వెళ్లడం వీరికి చాలా ఇష్టమట. అందుకే తాజాగా 26వ ట్రిప్‌కు కూడా సన్నాహాలు చేస్తున్నారట. గత రెండేళ్లుగా ఏ ట్రిప్‌కు వెళ్లని వీరు త్వరలోనే మరో దేశాన్ని చుట్టి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

ఈ వరల్డ్ టూర్ గురించి మోహన స్పందిస్తూ,, 'మేము 2007 నుండి ఇలా టూర్లకు వెళ్లడం మొదలుపెట్టాం. ఇప్పటివరకు 25 దేశాలను చూశాం. ఈ అక్టోబర్ 21న రష్యా వెళ్లి 28న తిరిగొస్తాం. ఈసారి మా మనవళ్లు, మనవరాళ్లను కూడా మాతో తీసుకెళ్తున్నాం. ఇప్పటివరకు వెళ్లిన వాటిలో స్విట్జర్లాండ్ నా ఫేవరెట్' అన్నారు. జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో ఈ ఓల్డ్ కపుల్‌ను చూసి నేర్చుకోవాలి అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Tags

Read MoreRead Less
Next Story