బ్రేకింగ్.. సినీ నటి, బీజేపీ నేత ఖూష్బూ అరెస్ట్‌

బ్రేకింగ్.. సినీ నటి, బీజేపీ నేత ఖూష్బూ అరెస్ట్‌

సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూను చెన్నైలో పోలీసులు అరెస్టు చేశారు. వీసీకే అధినేత తిరుమావళవన్‌ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన అమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమావళవన్‌.. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. ఖుష్బూ నేతృత్వంలోని బీజేపీ నేతలు.. నిరసనలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో చెన్నై నుంచి చిదంబరంకు ప్రయాణిస్తుండగా ముత్తుకాడు సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ఖూష్బూతోపాటు మరికొంతమంది మహిళా నేతలు, ఇతరులను పోలీసులు అదుపులోకి తసుకున్నారు.

వీసీకే అధినేత తిరుమావళవన్‌ ఇటీవల యూట్యూబ్ ఛానెల్‌లో మనుస్మృతి, మహిళల గురించి వివాదాస్పాద వ్యాఖ్యలు చేశారన్నది ఖుష్బూ ఆరోపణ. ఈ మేరకు ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. తన చివరి శ్వాస వరకు మహిళల గౌరవాన్ని కాపాడేందుకు పోరాడుతానని.. అరెస్టు తర్వాత ఖుష్బూ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మహిళల భద్రతకే ప్రాధాన్యత ఇస్తారని.. తాము కూడా ఆ మార్గంలోనే నడుస్తామన్నారు ఖుష్బూ.

Tags

Read MoreRead Less
Next Story