Lata Bhagwan Kare: 68 ఏళ్ల వయసులో భర్త కోసం మారథాన్‌.. ఆమె జీవితం ఓ చిత్రం..

Lata Bhagwan Kare: 68 ఏళ్ల వయసులో భర్త కోసం మారథాన్‌.. ఆమె జీవితం ఓ చిత్రం..
Lata Bhagwan Kare: తన భర్త ప్రాణాలను కాపాడేందుకు 68 ఏళ్ల వయసులో మారథాన్‌లో మొదటి బహుమతిని గెలుచుకున్న లతా భగవాన్ కరే ఎవరో, ఆమె ఎందుకు మారథాన్ నిర్ణయం తీసుకుందో తెలుసుకుందాం..

Lata Bhagwan Kare: తన భర్త ప్రాణాలను కాపాడేందుకు 68 ఏళ్ల వయసులో మారథాన్‌లో మొదటి బహుమతిని గెలుచుకున్న లతా భగవాన్ కరే ఎవరో, ఆమె ఎందుకు మారథాన్ నిర్ణయం తీసుకుందో తెలుసుకుందాం... మన దేశంలో చాలా మంది మహిళలు తమ భర్తల క్షేమం కోసం దేనికైనా సిద్ధపడతారు.

కర్వా చౌత్ ఉపవాసం నుండి వట్ సావిత్రి వద్ద మర్రి ఆరాధన వరకు, భారతీయ మహిళలు తమ భర్తలను అన్ని కష్టాల నుండి రక్షించమని ప్రార్థిస్తారు. ఇది మాత్రమే కాదు, అతి పెద్ద అడ్డంకులు అతితక్కువగా భావించి, మహిళలు తమ భర్తల సంతోషం కోసం ప్రయత్నిస్తారు.

సాధారణంగా ఈ వయసులో శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. ఎవరైనా ఓ ముద్ద వండి పెడితే తిని ఓ మూల కూర్చోవాలనుకుంటున్నారు. కానీ ఆమె మాత్రం భర్త ఆరోగ్యాన్ని బాగు చేయాలని కంకణం కట్టుకుంది. అందుకు డబ్బులు సమకూర్చుకునేందుకు మారథాన్ లో పాల్గొంది. రేసులో పాల్గొని మొదటి బహుమతిని గెలుచుకుని యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ఇంతకీ ఎవరీ లతా కరే.. ఆమెకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. లతా భగవాన్ కరే మహారాష్ట్రలోని బారామతి జిల్లాలోని ఓ గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఆమె వయస్సు 68 సంవత్సరాలు. ఆమెను గ్రామస్తులంతా మారథాన్ రన్నర్ అని పిలుస్తారు.

2014 సంవత్సరం వరకు, ఆమె పేరు కూడా ఎవరికీ తెలియదు, కానీ ఆమె మారథాన్ రేసులో పాల్గొని బహుమతి గెలుచుకునేసరికి లతా కరే గురించి అందరికీ తెలిసింది. అంతే కాదు ఆమె పేరు మీద ఇప్పుడు మరాఠీ సినిమా కూడా రూపొందింది. ఆమె స్ఫూర్తిదాయకమైన గాథను మరింత మందికి చేరువ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

ఎందుకు మారథాన్‌లో పాల్గొన్నారు

తమ మనవళ్లతో ఆడుకునే వయసులో, లత మారథాన్‌లో లాంగ్ రన్‌లో పాల్గొని మొదటి బహుమతిని కూడా గెలుచుకుంది. అయితే మారథాన్‌లో పాల్గొనడం లతకు హాబీ కాదు కానీ అవసరం. ఆ సంవత్సరం లత భర్త చాలా అనారోగ్యం పాలయ్యాడు. అతని చికిత్సకు లత దగ్గర డబ్బులు లేవు. డబ్బు సంపాదించి తన భర్త జీవితాన్ని కాపాడుకోవాలనే కోరిక లతను కాలు నిలవనీయకుండా చేసింది. పరుగులు తీసింది.. మారథాన్ లో పాల్గొంది.

పూర్తి కథ ఏమిటి

లత మరియు ఆమె భర్త భగవాన్ బుల్దానా జిల్లాకు చెందినవారు, కానీ పని నిమిత్తం మహారాష్ట్రలోని బారామతిలో నివసించడం ప్రారంభించారు. అక్కడ భగవాన్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండేవాడు. లత భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ పొలాల్లో పనిచేస్తుండేది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎలాగో కష్టపడి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేశారు. కొడుక్కి పర్మినెంట్ ఉద్యోగం లేకపోవడంతో వచ్చే ఆ కొద్దిపాటి ఆదాయంతోనే ఇంటిని నడిపేవాడు.

భర్త ఆరోగ్యం క్షీణించినప్పుడు తీసుకున్న చర్యలు

2014లో, లత భర్త భగవాన్ ఆరోగ్యం క్షీణించింది. తల తిరగడం, ఛాతీ నొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ డాక్టర్లకు చూపించుకున్నాడు. వాళ్లు ఎంఆర్‌ఐ చేయమన్నారు. దాని కోసం ఐదు వేలు ఖర్చవుతుంది. కానీ లత దగ్గర అంత డబ్బు లేదు. అదే సమయంలో ఒక వార్త ఆమె చెవిన పడింది.

బారామతిలో మారథాన్ జరగబోతోందని, విజేతకు రూ.5వేలు బహుమతిగా ఇస్తారని తెలుసుకుంది. ఆ సమయంలో లత వాళ్ల ఊరి పిల్లలు అమ్మమ్మా నువ్వు చాలా బాగా పరిగెడుతావు కాబట్టి రేసులో పాల్గొను అని చెప్పారు. లత ప్రజల సూచన మేరకు రేసులో పాల్గొనాలనుకుంది.

రేసు ప్రారంభమైంది, కొంత సమయం తర్వాత లత చెప్పులు తెగిపోయాయి. అయినా ఆమె దానిని పట్టించుకోలేదు. తెగిన చెప్పులను అక్కడే వదిలేసి పరిగెత్తింది. చివరకు రేసులో గెలిచింది. రివార్డు డబ్బులు అందుకుని భర్తకు వైద్యం చేయించింది.

ఎన్నో బహుమతులు గెలుచుకుంది

తన భర్త చికిత్స కోసం మొదటిసారిగా మారథాన్‌లో పరుగుతీసి గెలుపొందిన తర్వాత ఆమెకు మరింత ప్రోత్సాహం లభించింది. అనేక ఇతర రేసుల్లో కూడా పాల్గొనే అవకాశాలు వచ్చాయి. 2014లో మూడు కిలోమీటర్ల మారథాన్‌లో లత పాల్గొంది. ఇప్పటి వరకు ఆమె చాలాసార్లు మారథాన్‌లో పరుగెత్తింది అనేక షీల్డ్‌లు, బహుమతులు గెలుచుకుంది.

లత మీద మరాఠీ సినిమా

'లతా భగవాన్ కరే' అనే పేరున్న లత జీవితంపై కూడా ఓ సినిమా రూపొందింది. ఈ చిత్రం గత ఏడాది విడుదలైంది. మరాఠీ భాషలో నవీన్ దేశబోయిన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జనవరి 17న విడుదలైంది. ఈ చిత్రంలో లత పాత్రను ఆమే పోషించారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లత మాట్లాడుతూ.. "నేను కేవలం డబ్బు సంపాదించాలని అనుకున్నాను. సినిమాలో నటించే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు" అని చెప్పింది.

నిజంగా, తన భర్తను రక్షించుకోవడానికి లత తీసుకున్న ఇంత పెద్ద అడుగు అభినందనీయం. ఆమెను మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాలి.

ఈ సినిమా 67వ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకొంది. మరాఠీలో 'లతా భగవాన్‌ కారే' చిత్రాన్ని రూపొందించిన తెలుగు దర్శక-నిర్మాతలు ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story