ఎంపీలంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలి: లోక్‌సభ స్పీకర్

ఎంపీలంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలి: లోక్‌సభ స్పీకర్
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు హాజరయ్యే ఎంపీలంతా కరోనా పరీక్షలు చేపించుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కోరారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు హాజరయ్యే ఎంపీలంతా కరోనా పరీక్షలు చేపించుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కోరారు. అయితే, సమావేశాలకు 72 గంటల ముందే ప్రతీఒకరూ పరీక్షలు చేపించుకోవాలని అన్నారు. ఎంపీలతో పాటు పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించే అధికారులు, మీడియా ప్రతినిథులు అందరూ చేపించుకోవాలన్నారు. కాగా.. సమావేశాలు సెప్టెంబర్ 14న ప్రారంభమై, అక్టోబర్ 1న ముగియనున్నాయి. పార్లమెంట్ సమావేశాల ఏర్పాట్లపై ఆరోగ్యమంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, ఎయిమ్స్, డీఆర్‌డీఓ, ఢిల్లీ ప్రభుత్వ అధికారులతో లోక్‌సభ స్పీకర్‌ శుక్రవారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఒకరి ఒకరు ముట్టుకోకుండా జీరో టచ్ సెక్యూరిటీ చెక్ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు అవసరమైతే కోవిడ్‌ పరీక్షలు సైతం నిర్వహిస్తామని స్పీకర్‌ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story