లాటరీ విక్రేత నిజాయితీ.. డబ్బులు చెల్లించకపోయినా గెలిచిన రూ.6 కోట్ల టికెట్‌ను విజేతకు అందించి..

లాటరీ విక్రేత నిజాయితీ.. డబ్బులు చెల్లించకపోయినా గెలిచిన రూ.6 కోట్ల టికెట్‌ను విజేతకు అందించి..

స్మిజా.. లాటరీ గెలుచుకున్న చంద్రన్ అతని భార్య

లాటరీ టికెట్ కొనేందుకు డబ్బులు లేవన్నా పర్లేదు అంకుల్ రేపు ఇద్దురు లెండి. ముందైతే ఓ టికెట్ తీసుకోండి. నా దగ్గర ఇంకా 12 టిక్కెట్లు ఉన్నాయి. ఇందులో ఏ నెంబర్ టికెట్ కావాలో చెప్పండి.. నేను దాన్ని మీ కోసం హోల్డ్ చేసి ఉంచుతాను అంది.

లాటరీ టికెట్ కొనేందుకు డబ్బులు లేవన్నా పర్లేదు అంకుల్ రేపు ఇద్దురు లెండి. ముందైతే ఓ టికెట్ తీసుకోండి. నా దగ్గర ఇంకా 12 టిక్కెట్లు ఉన్నాయి. ఇందులో ఏ నెంబర్ టికెట్ కావాలో చెప్పండి.. నేను దాన్ని మీ కోసం హోల్డ్ చేసి ఉంచుతాను అంది. అతడి అదృష్టం బావున్నట్టుంది. అందుకే ఆ టిక్కెట్‌కే రూ.6 కోట్లు లాటరీ తగిలింది.

జాక్ పాట్ కొట్టిన చంద్రన్‌కి మరుసటి రోజు ఆ అమ్మాయి వచ్చి చెప్పేసరికి అతడికి నోటి మాట రాలేదు. స్మిజాతో అమ్మా ఇదంతా నీ నోటి చలవే అన్నాడు. తనకు లాటరీ తగిలిన విజయం నిజమా కాదా అని ఆశ్చర్యపోయాడు. మరోసారి టికెట్ నెంబర్ పరీక్షించుకున్నాడు. నిజమే అని తెలిసి ఒక్కసారిగా రూ.6 కోట్లు వచ్చిన ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.

కేరళకు చెందిన లాటరీ విక్రేత రూ .6 కోట్ల బంపర్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసిన వ్యక్తికి అందజేయడంతో ఆమె నిజాయితీని ప్రశంసించారు కేరళ వాసులు. స్మిజా కె మోహన్ విజేత టికెట్‌ను చంద్రన్‌కు అమ్మారు. ఆమె తన జీవనోపాధి కోసం లాటరీ టికెట్లను విక్రయించి తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. ఇద్దరు పిల్లలతో వచ్చిన దాంట్లోనే సంతోషంగా జీవనాన్ని సాగిస్తోంది స్మిజా కుటుంబం.

మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన 37 ఏళ్ల స్మిజా దగ్గర అమ్ముడుపోని 12 లాటరీ టిక్కెట్లు ఉన్నాయి. ఆదివారం కావడంతో రెగ్యులర్ కస్టమర్లు ఎవరూ రాలేదు. తన వాట్సాప్ గ్రూపులో రోజూ వచ్చే కస్టమర్లకు మెసేజ్ పెట్టింది. టికెట్లు కొనమని అడిగింది.

"అయితే, మొత్తం 12 టికెట్లు కొనడానికి ఎవరూ సుముఖంగా లేరు. ఆ తర్వాతే ఆమె చంద్రన్‌ను సంప్రదించింది. టిక్కెట్ల ఫోటోలను పంపమని చంద్రన్.. స్మిజాను అడిగాడు. ఫోటోలు పంపించిన వెంటనే తనకు నచ్చిన నంబర్ సెలెక్ట్ చేసుకుని తిరిగి ఆమెకు మెసేజ్ పెట్టారు. చంద్రన్ అప్పటికే ఆమె దగ్గర కొన్న లాటరీ టికెట్లకు డబ్బులు బాకీ ఉన్నారు.

అయినా కొనమంటూ స్మిజా వత్తిడి చేసింది. తన బాకీ తరవాత తీర్చొచ్చు అని చెప్పింది. రూ.200ల టికెట్‌ను ఆయన పేరు మీద హోల్డ్ చేసింది. ఆరోజు సాయింత్రమే లాటరీ టికెట్ల రిజల్ట్ వచ్చింది. జాక్‌పాట్ కొట్టిన విజేతల పేర్లు ప్రకటించింది భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ సంస్థ. లాటరీ విజేతల్లో చంద్రన్ నెంబర్ ఉంది. స్మిజా వెంటనే ఆ టికెట్‌ను తీసుకెళ్లి దాని యజమాని చంద్రన్‌కు అందించింది.

మీకు ఆరు కోట్లు వచ్చాయి కదా అంకుల్.. మరి నా బాకీ తీర్చేస్తారా అని అడగ్గానే ఆయన ఆనందంతో ఆమెకు ఇంతకు ముందు ఇవ్వాల్సిన డబ్బులతో కలిపి మొత్తం రూ.1200లు స్మిజాకు ఇచ్చేశారు.

"టిక్కెట్‌ను చంద్రన్‌కు అప్పగించిన తరువాత నా నిజాయితీని ప్రశంసిస్తూ నాకు కాల్స్ వస్తున్నాయి. అయినప్పటికీ, ఈ వ్యాపారంలో, అన్ని విషయాలూ ప్రజలకు అర్థం కావడం లేదు. మనం నిజాయితీగా ఉండాలి టిక్కెట్లు కొనడానికి కస్టమర్లు కష్టపడి సంపాదించిన డబ్బును ఉపయోగిస్తారు. అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఆశ పడతారు. వారిని మనం నిరుత్సాహ పరచకూడదు. వారి డబ్బును మనం ఆశించకూడదు. ఎవరి అదృష్టం వారిది. ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో అదృష్టం వరిస్తుంది.

కొచ్చిలోని అలూవాలోని రాజగిరి హాస్పిటల్ సమీపంలో స్మిజా, ఆమె భర్తకు లాటరీ స్టాల్ ఉంది. పార్ట్‌టైమ్‌గా వారు లాటరీ టికెట్ల వ్యాపారాన్ని ప్రారంభించారు. "నేను, నా భర్త ఇద్దరం కక్కనాడ్లో ప్రభుత్వ ప్రెస్‌‌లో పని చేసేవారం. మేము 2011 లో లాటరీ టికెట్ల వ్యాపారం ప్రారంభించాము. అప్పుడు ఈ స్టాల్‌లో ఐదుగురు ఉద్యోగులు పనిచేసే వారు. అయితే, కరోనా లాక్‌డౌన్ సమయంలో మా ఇద్దరి ఉద్యోగాలు పోయాయి. దాంతో మేము పూర్తి సమయం షాపులోనే ఉంటూ మా వ్యాపారాన్ని చూసుకుంటున్నాము అని ఆమె చెప్పింది.

స్మిజా యొక్క నిజాయితీని ప్రశంసిస్తూ కేరళ మీడియా ఆమె ఫోటోని ఫ్రంట్ పేజీలో ప్రముఖంగా ప్రచురించింది.

Tags

Read MoreRead Less
Next Story