వీరలక్ష్మికి వందనం.. మొదటి మహిళా అంబులెన్స్ డ్రైవర్ గా ఆమె..

వీరలక్ష్మికి వందనం.. మొదటి మహిళా అంబులెన్స్ డ్రైవర్ గా ఆమె..
కరోనా అంటేనే ఆమడ దూరం పారిపోతున్న ఈ రోజుల్లో కరోనా పేషెంట్లను అంబులెన్స్ లో ఎక్కించుకుని సకాలంలో వారిని వైద్యుల వద్దకు.

కూతురుగా, భార్యగా, తల్లిగా, అంబులెన్స్ డ్రైవర్ గా ఆమె సేవలు అనిర్వచనీయం. తమిళనాడు రాష్ట్రంలో మొదటి మహిళా అంబులెన్స్ డ్రైవర్ గా వీరలక్ష్మి నియమితురాలైంది. కరోనా అంటేనే ఆమడ దూరం పారిపోతున్న ఈ రోజుల్లో కరోనా పేషెంట్లను అంబులెన్స్ లో ఎక్కించుకుని సకాలంలో వారిని వైద్యుల వద్దకు చేరుస్తోంది. వారి ప్రాణాలు కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తోంది. ఆగస్టు 31న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి 118 కొత్త అంబులెన్స్ లకు పచ్చజెండా ఊపి ప్రజల వైద్య సేవలకు వాటిని అంకితం చేశారు.

చెన్నైకు చెందిన వీరలక్ష్మి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసింది. భర్త క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. కుటుంబపోషణలో భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఆమెకూడా డ్రైవింగ్ నేర్చుకుని తనూ క్యాబ్ డ్రైవర్ గా మారింది. తనతో పాటు మరికొంత మంది మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చే పనిని కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం.. అంబులెన్స్ డ్రైవర్ల కోసం ప్రకటన ఇచ్చింది. అది చూసిన వీరలక్ష్మి అందుకు కావలసిన అర్హతలన్నీ నాలో ఉన్నాయి. నేనెందుకు అప్లై చేయకూడదు అని అనుకుంది. కానీ అంబులెన్స్ డ్రైవర్ గా ఇప్పటి వరకు స్త్రీలెవరూ పని చేయలేదు..

అమ్మ ఇచ్చిన ధైర్యంతో ముందడుగు వేసి డ్రైవర్ పోస్ట్ కి అప్లై చేసింది. వీరలక్ష్మి సెలెక్ట్ అవడంతో ఆమెకు అవసరమైన ట్రైనింగ్ ఇచ్చారు. ఇంతకు ముందు ప్యాసింజర్లను కూర్చోబెట్టుకుని క్యాబ్ నడిపిన ఆమె.. ఇప్పుడు పేషెంట్లను, ఒక్కోసారి డెడ్ బాడీలను కూడా తీస్కెళ్లాల్సి వస్తుంది. అయినా ధైర్యంగా ముందుకు సాగుతోంది. యూనీఫామ్ వేసుకుని మొదటి రోజు అంబులెన్స్ నడుపుతుంటే చూడడానికి తండ్రి, పదేళ్ల కూతురు, ఐదేళ్ల కొడుకు వచ్చారు.. అమ్మ వైపు ఆశ్చర్యంగానూ, గర్వంగానూ చూశారు వీరలక్ష్మి ఇద్దరు చిన్నారులు. కరోనా సమయంలో కొవిడ్ రోగులకు సేవ చేయబోతున్నానన్న సంతృప్తి తనను ముందుకు నడిపిస్తోంది అని చెబుతోంది వీరలక్ష్మి.

Tags

Read MoreRead Less
Next Story