అదృష్టం పండింది.. వజ్రం దొరికింది.. గని కార్మికుడికి రూ. 40లక్షల విలువ చేసే..

అదృష్టం పండింది.. వజ్రం దొరికింది.. గని కార్మికుడికి రూ. 40లక్షల విలువ చేసే..
వజ్రం దొరికిన విషయం అతడి భార్య లాద్వతికి తెలిసి సంతోషించింది.

కష్టాలు గట్టెక్కాలంటే అదృష్ట దేవత వరించాలి.. చాలీ చాలని జీతం.. గని కార్మికుడి జీవితంలోకి ఐశ్వర్యం వజ్రం రూపంలో వచ్చింది. గురువారం మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని ఓ గని వద్ద తవ్వకాలు జరుపుతుండగా 7.2 క్యారెట్ల వజ్రం కంట పడింది. బల్బీర్ సింగ్ యాదవ్ జిల్లాలోని పాటి బజారియా ప్రాంతంలోని కృష్ణ కళ్యాణపూర్ గని వద్ద పని చేస్తుండగా అతడికి విలువైన రాయి కనిపించినట్లు డైమండ్ ఇన్‌స్పెక్టర్ అనుపమ్ సింగ్ తెలిపారు. దాన్ని తీసుకు వెళ్లి గని కార్యాలయ అధికారులకు అందజేశాడు.

వజ్రం యొక్క ఖచ్చితమైన విలువను అధికారులు నిర్ణయిస్తారని అధికారి తెలిపారు. బల్బీర్ సింగ్‌కి వజ్రం దొరికిన విషయం అతడి భార్య లాద్వతికి తెలిసి సంతోషించింది. తమ జీవితాలు నేటి నుంచి మారిపోతాయని ఆనందం వ్యక్తం చేస్తోంది. విలేకరులతో మాట్లాడుతూ ఆమె తన భర్తకు దొరికిన ఆ వజ్రం ధర రూ .35 లక్షల నుండి రూ .40 లక్షల మధ్య ఉంటుందని తమకు సమాచారం అందిందని చెప్పింది. ఈ రాయిని వేలం వేయనున్నారు మైన్ అధికారులు. దీని తరువాత దంపతులకు 12.5 శాతం రాయల్టీ తగ్గింపు తర్వాత మిగిలిన సొమ్మును బల్బీర్ కుటుంబానికి అందజేస్తారు. బుందేల్‌ఖండ్‌లోని వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పన్నా వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వందల టన్నుల విలువ చేసే పసిడి, వజ్ర నిక్షేపాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిన విషయం విదితమే.

Tags

Read MoreRead Less
Next Story