మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు ఆయన పంపించారు.

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు ఆయన పంపించారు. ఆయన రాజీనామా చేసినట్లు ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ కమిషనర్‌ పరమ్‌ బీర్‌ సింగ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టయిన సచిన్ వాజేకు దేశ్‌ముఖ్‌ ప్రతినెలా వందకోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టారంటూ పరమ్ బీర్‌ ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరపాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతో పాటు న్యాయవాది జయశ్రీ పాటిల్‌, మరో టీచర్‌ కూడా ఈ ఆరోపణలపై పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో.... అనిల్‌ దేశ్‌ముఖ్‌ హోంమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

ప్రతి నెల 100కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేయాల‌ని టార్గెట్ పెట్టాడ‌న్నది అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ప్రధాన ఆరోప‌ణ‌. ఇదే అంశాన్ని ద‌ర్యాప్తు చేయాల‌ని బాంబే హైకోర్టు సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించింది. 15రోజుల్లో ప్రాథ‌మిక ద‌ర్యాప్తు పూర్తి చేయాల‌ని ఆదేశించింది. దీంతో విచార‌ణ‌కు స‌హ‌క‌రించేందుకు గాను హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌ను సీఎం ఉద్దవ్ థాక్రేకు పంపించారు. ఇన్నాళ్లుగా ఆరోప‌ణ‌లు వ‌చ్చినా వెన‌క్కి త‌గ్గని ఆయ‌న‌… ఇప్పుడు రాజీనామా చేయ‌టంతో మహారాష్ట్రలో రాజ‌కీయాలు వేడెక్కాయి. ఆయ‌న‌పై ఇంటా బ‌య‌ట ఒత్తిడి పెర‌గ‌టంతోనే రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story