Manik Saha : త్రిపుర కొత్త సీఎంగా మాణిక్ సాహా..!

Manik Saha : త్రిపుర కొత్త సీఎంగా మాణిక్ సాహా..!
Manik Saha : శ‌నివారం బిప్లవ్‌దేవ్ కుమార్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో పార్టీ ఎమ్మెల్యేలు త‌మ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా మాణిక్ స‌హాను ఎన్నుకున్నారు.

Manik Saha : త్రిపుర అధికార పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి బిప్లవ్​కుమార్​దేవ్​ రాజీనామా చేశారు. ఇవాళ తన రాజీనామా లేఖను గవర్నర్​ఎస్​ఎన్​ఆర్యను కలిసి అందజేశారు. అటు అంతేవేగంగా త్రిపుర నూతన సీఎంగా మానిక్ సాహా ఎంపికయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం త్రిపుర ముఖ్యమంత్రిగా మానిక్ సాహా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు త్రిపుర అధికార పార్టీలో కొన్ని నెలలుగా బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌కు వ్యతిరేకంగా నేతలు గళం విప్పారు. త్రిపుర రాష్ట్రం నుంచి అధిష్టానానికి పెద్దఎత్తున ఫిర్యాదులు సైతం వెళ్లాయి. పార్టీ, ప్రభుత్వంలో అంతర్గత విభేదాలతోనే బిప్లవ్​కుమార్​దేవ్ రాజీనామా చేసినట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన బిప్లా కుమార్ దేవ్‌...ఇవాళ రాజీనామాను ప్రకటించారు. బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పార్టీ నిర్ణయం మేరకు కృషి చేస్తాన్నారు మాజీ సీఎం బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌.

అటు త్రిపుర నూతన సీఎం ఎంపికపై అధిష్ఠానం రాష్ట్రంలోని నేతలందరి అభిప్రాయలను పరిగణలోకి తీసుకుంది. ఇందుకుగాను కేంద్ర పరిశీలకులుగా కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్‌ త్వడే త్రిపురలో పర్యటించారు. సీఎం రేసులో ఉపముఖ్యమంత్రి జిష్ణు దేవ్​ వర్మతోపాటు కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ సైతం రేసులో నిలిచారు. పార్టీ సమావేశంలో చర్చించిన అనంతరం ఎట్టకేలకు కొత్త సీఎంగా మానిక్ సాహా పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.

69 ఏళ్ల మాణిక్ స‌హా వృత్తిరీత్యా దంత వైద్యుడు.. ఈ ఏడాది ప్రారంభంలో త్రిపుర నుంచి రాజ్యస‌భ‌కు ఎన్నిక‌య్యారు. 2016లో కాంగ్రెస్ పార్టీని బీజేపీలో చేరిన ఆయన.. 2020లో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఎన్నికయారు.. మాణిక్ స‌హా త్రిపుర క్రికెట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్‌గానూ ఉన్నారు. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు హ‌పానియాలోని త్రిపుర మెడిక‌ల్ కాలేజీలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేశారు. ఆయనకు భార్య స్వప్న సాహా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story