Farm Laws Repeal: తేల్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి: రాకేశ్ టికాయత్

Rakesh Tikait (tv5news.in)

Rakesh Tikait (tv5news.in)

Farm Laws Repeal: మొత్తానికి అత్యంత ప్రమాదకర సాగు చట్టాలు రద్దయ్యాయన్నారు భారతీయ కిసాన్ యుూనియన్ లీడర్ రాకేశ్ టికాయత్.

Farm Laws Repeal: మొత్తానికి అత్యంత ప్రమాదకర సాగు చట్టాలు రద్దయ్యాయన్నారు భారతీయ కిసాన్ యుూనియన్ లీడర్ రాకేశ్ టికాయత్. సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపాక తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నారు. 750మంది అన్నదాతలు మరణాలు సహా, పంటకు కనీస మద్దతు ధర, అక్రమ కేసులపై కేంద్రం సమాధానం చెప్పాలన్నారు.

చట్టాల ఉపసంహరణ బిల్లుపై చర్చకు కేంద్రం భయపడిందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. చట్టాల రద్దుపై చర్చ జరక్కపోవడం దురదృష్టకరమన్నారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదని తాము ముందే చెప్పామన్నారు రాహుల్.

చట్టాలు ఉపసంహరించుకుని చేతులు దులుపుకుంటే కుదరదన్నారు SP అధినేత అఖిలేష్ యాదవ్. చనిపోయిన 700 రైతుల కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. యూపీలో అధికారంలోకి వచ్చాక ప్రతి రైతుకుటుంబానికి 25 లక్షల పరిహారం ఇస్తామన్నారు అఖిలేష్.

పొలిటికల్ డ్యామేజ్ ను గ్రహించే కేంద్రం చట్టలను వెనక్కి తీసుకుందన్నారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. రాజ్యాంగ విరుద్ధమైన CAA అమెండ్ మెంట్ యాక్టును కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు

బీజేపీ పాలనలో రాజ్యంగా వ్యవస్థలు సైతం దిగజారిపోయాయన్నారు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది. తప్పు చేసిన నిందితులకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తారనీ.. కానీ చట్టసభల్లో తాము గొంతు తెరిచే పరిస్థితి కూడా లేదన్నారు.

ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో చట్టసభల్లో ఇలాంటి వాతావరణం చూడలేదన్నారు SP ఎంపీ జయా బచ్చన్. రైతుల మృతి, అన్నదాతల ఆందోళనలు, పెరుగుతున్న ధరలు ఇలా ఇన్ని సమస్యలుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు.

మంగళవారం విపక్ష నాయకులంతా కాంగ్రెస్ సీనియర్ నేత మళ్లీఖార్జున ఖర్గే నివాసంలో భేటీ కానున్నారు. అపోజిషన్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు సహా.. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story